
చరణ్ సుకుమార్ కాంబో మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా ఈ సినిమాలోని కొన్ని సీన్లు న భూతో న భవిష్యత్ అనేలా ఉంటాయని రాజమౌళి వెల్లడించారు. అయితే రామ్ చరణ్ తో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్న దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు. ఇప్పటివరకు చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. చరణ్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
అదే సమయంలో త్రివిక్రమ్ చెప్పిన లైన్ రామ్ చరణ్ కు సైతం నచ్చిందని భోగట్టా. అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిన నేపథ్యంలో రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. మెగా అల్లు ఫ్యామీలీల మధ్య కొంత గ్యాప్ ఏర్పడ్డ నేపథ్యంలో తన వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగకుండా రామ్ చరణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఆలోచించే హీరోలు ఎంతమంది ఉంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ లైనప్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న ఈ హీరో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.