
అయితే మొదటి ప్రీమియర్ లో పుష్పరాజ్ రూలింగ్ స్పష్టంగా కనపడింది. ఇండియా వైడ్ విపరీతంగా చూసే ఐపీఎల్ యావరేజ్ రికార్డుని సైతం పుష్ప 2 చిత్తు చేసింది. నార్త్ లో లేటెస్ట్ సీజన్ ఐపీఎల్ 2025కి టెలివిజన్ రేటింగ్ 4.6 వస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాకి ఫస్ట్ ప్రీమియర్ లో 5.1 టీవీఆర్ వచ్చింది. దీంతో స్మాల్ స్క్రీన్‌పై బన్నీ నయా రికార్డ్‌ను సెట్ చేశారు.
అదే విధంగా సినిమాల పరంగా చూస్తే.. బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టిన `స్త్రీ 2` రికార్డుని పుష్ప 2 క్రాస్ చేసేసింది. దీంతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 మూవీ 2021 నాటి పుష్ప: ది రైజ్ చిత్రానికి సీక్వెల్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు