టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించిన నటీమణులలో లయ ఒకరు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకుంది. లయ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణతో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు కెరియర్ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగించిన ఈ బ్యూటీ ఒక్క సారిగా సినిమాలకు దూరం అయింది.

చాలా సంవత్సరాల పాటు ఈమె సీని పరిశ్రమకు దూరంగా ఉంది. ఇకపోతే ఈమె మళ్ళీ సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు అనే మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో లయ , నితిన్ కి అక్క పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా గనుక మంచి విజయం సాధించినట్లయితే లయ కి తెలుగులో వరుస పెట్టి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే లయ కొన్ని సంవత్సరాల క్రితం జగపతి బాబు , అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన హనుమాన్ జంక్షన్ అనే మూవీ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని జూన్ 28 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇలా ఇంత కాలం పాటు లయకి సంబంధించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా పలకరించలేదు. కానీ కేవలం ఒకే వారం గ్యాప్ లోనే ఈమె నటించిన ఓ సినిమా రీ రిలీజ్ కానుంది. అలాగే ఓ  కొత్త సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో ఈమె ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: