కోలీవుడ్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి కమల్ హాసన్ కొంత కాలం క్రితం వరకు సినీ కెరియర్ను కాస్త స్లో గా ముందుకు సాగించాడు. అలాంటి సమయం లోనే కమల్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తో కమల్ అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. దానితో కమల్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలతో పలకరిస్తున్నాడు. విక్రమ్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత కమల్ , శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు.

సినిమా అద్భుతమైన విజయం సాధించిన భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. ఇక తాజాగా కమల్ , మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కమల్ , మణిరత్నం కాంబోలో దాదాపు 38 సంవత్సరాల క్రితం నాయకన్ మూవీ వచ్చి మంచి విజయం సాధించడంతో , ఈ కాంబో మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కూడా కమల్ కి నిరాశనే మిగిల్చింది. తాజాగా కామన్ ఓ క్రేజీ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సిద్ధార్థ్ హీరోగా రూపొందిన చిన్న మరియు విక్రమ్ హీరోగా రూపొందిన వీర ధిర శుర సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకుని , దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి అరుణ్ కుమార్ , కమల్ కి ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో అరుణ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: