
ఈసినిమాకు ఈ రేంజ్ లో కలక్షన్స్ రావడానికి ప్రధానకారణం ప్రభాస్ అని చెపుతూ అతడు అందించిన సహకారం మాటలకు అందనిది అంటూ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖ దర్శకులు ఉన్నప్పటికీ తాను ‘మహాభారతం’ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ను ఎందుకు ఎంచుకున్నాడు అన్న అంశం పై ఆశక్తికర కామెంట్స్ చేశాడు.
గత కొన్ని సంవత్సరాలుగా తాను నటించిన అనేక సినిమాలు భయంకరమైన ఫ్లాప్ లుగా మారిన పరిస్థితులలో తనను హీరోగా పెట్టుకుని సినిమా తీయడానికి ఏతెలుగు దర్శకుడు సాహసం చేయడని అందుకనే తాను వాస్తవాలను గుర్తించి బాలీవుడ్ దర్శకుడుని ఎంచుకున్నానని అంటూ వాస్తవాన్ని ఎటువంటి మోహమాటాలు లేకుండా చెప్పి మీడియా వర్గాల అభినందనలు పొందాడు. ఈసినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో రానున్న రోజులలో ఒక కమర్షియల్ సినిమా తీయాలని తనకు కోరిక ఉంది అంటూ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
తన తమ్ముడు మంచు మనోజ్ ‘కన్నప్ప’ మూవీ చూసి చేసిన ప్రశంసల విషయమై మీడియా వర్గాలు ప్రశ్నించగా ఆయనకు కూడ తన కృతజ్ఞతలు అంటూ ఎటువంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండ మంచు విష్ణు వ్యవహరించిన తీరు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ‘కన్నప్ప’ కలక్షన్స్ విషయంలో వీకెండ్ తరువాత వస్తున్న మొదటి సోమవారం చాల కీలకంగా మారనున్నది. ఈమూవీకి ఈరోజు ఎంతవరకు కలక్షన్స్ వస్తాయి అన్న విషయం పై ఈమూవీ సక్సస్ అంచనా వేయబడుతుంది..