విజయ్ దేవరకొండ రీసెంట్గా నెపోకిడ్ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలకు ఏదైనా చేసే స్వాతంత్రం ఉంటుంది. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే హీరోలకు ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. ఒక కథ నచ్చకపోతే దాన్ని నచ్చలేదు అని మొహం మీదే రిజెక్ట్ చేసే అంత ఫ్రీడమ్ కూడా ఉండదు.కానీ నెపోకిడ్ లకు అలా కాదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అంటూ మాట్లాడారు. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా మంచు మనోజ్ తాజాగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మంచు మనోజ్ తాజాగా ఓ భామ అయ్యో రామ  అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.. 

ఈవెంట్ లో మాట్లాడుతూ.. సుహాస్ చాలామందికి ఆదర్శం.. ముఖ్యంగా ఈయన ప్రయాణం నాకు స్ఫూర్తి.. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తీసి కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా మారారు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సుహాస్ ని చూసి నేర్చుకోవచ్చు.ఎంతో కష్టపడి ఇంత మంచి స్థాయికి వచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళకి నెపో కిడ్స్ కే అవకాశాలు దక్కుతాయి అనే టాక్ ఎప్పటి నుండో ఉంది.కానీ ఈ అపవాదిని పక్కన పెట్టాలి. ఎందుకంటే నెపో కిడ్స్ కి బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులభం అవుతుంది.

కానీ ఇండస్ట్రీలోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చాక ఎవరైనా సరే నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది . నెపోటిజం ఇక్కడ పనికిరాదు. బ్యాగ్రౌండ్ ఉండి నెపో కిడ్  అయినంత మాత్రాన సక్సెస్ రాదు.సినిమాల కోసం కష్టపడి మనం పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తేనే ఇండస్ట్రీలో మనం నిలదోక్కుకోగలుగుతాం. నెపోకిడ్  అయినంత మాత్రాన పప్పులు ఉడకవ్.. సుహాస్ విజయ్ సేతుపతి లాగా ఓవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎంతో బాగా రాణిస్తున్నారు అంటూ మంచు మనోజ్ మాట్లాడారు. అయితే మంచు మనోజ్ చేసిన కామెంట్లు విజయ్ దేవరకొండ నెపోకిడ్ అనే కామెంట్లకు కౌంటర్గా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: