హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో యమ ఫాస్ట్ అయిపోయారు . ఎంతలా అంటే..ఇందస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే ప్రేమలో పడిపోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ తాన్య రవిచంద్రన్ కూడా అలానే చేసింది. హీరోయిన్ తాన్య రవిచంద్రన్ ప్రేమలో పడింది.  ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన రకరకాల వార్తలు బాగా వైరల్ అవుతూ వినిపించాయి.  ఈ మేరకు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేసింది తాన్య రవిచంద్రన్.


అది కూడా లిప్ కిస్ చేసిన ఫోటో ని షేర్ చేసింది. దీంతో అభిమానుల శుభాకాంక్షలు చెప్పుతున్నారు. ఆమె కి సంబంధించి స్పెషల్ పోస్టులు పెడుతున్నారు . తాన్య రవి చంద్రన్ సినిమా కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే.  2016లో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అడుగు పెట్టింది . తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తుంది.  హీరో రవిచంద్రన్ మనవరాలే ఈ తాన్య రవిచంద్రన్. వరుస అవకాశాలతో కోలీవుడ్ లో దూసుకుపోతుంది . తెలుగులో కార్తికేయ నటించిన "రాజా విక్రమార్క" అనే సినిమాలో హీరోయిన్గా తొలిసారి అవకాశం అందుకుంది.



కాగా చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమాలో నయనతార కు చెల్లి క్యారెక్టర్ లో తాన్య నటించిన విషయం అందరికీ తెలిసిందే . ఈ 29 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ తాన్య తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకున్న ఫోటో రివిల్ చేసింది . చిత్ర పరిశ్రమలో  సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తున్న గౌతమ్ ఛార్జ్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుంది.  వీళ్లిద్దరు లిప్ కిస్ పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది హీరోయిన్ . దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇంత బోల్డా ..?? నువ్వు అంటూ కొంతమంది షాక్ అవుతుంటే.. మీ కొత్త ప్రయాణం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ కొందరు బ్లెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: