స్నేహం అనేది మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని విలువైన బంధం. ఒక్క నిజమైన స్నేహితుడు ఉంటే వేలమంది మధ్య ఒంటరిగా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆపదలెన్నైనా తేలికగానే అనిపిస్తాయి. జీవితం తడబడినా, నడక మాత్రం నిలవదు. నిజమైన స్నేహితులకు ధన్యవాదాలు చెప్పడానికి, బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి మ‌న భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటారు. నేడు ఫ్రెండ్షిప్ డే సంద‌ర్భంగా టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రెవ‌రో తెలుసుకుందాం.


ప్రభాస్ - గోపీచంద్.. వీరిద్దరూ వ‌ర్షం మూవీ టైమ్ నుంచే క్లోజ్ ఫ్రెండ్స్. వాస్త‌వానికి ఆ చిత్రంలో ఒక‌రు హీరోగా, మ‌రొక‌రు విల‌న్‌గా న‌టించారు. కానీ రియ‌ల్ లైఫ్ లో మాత్రం ప్రాణస్నేహితులు.. ఒకరి స‌క్సెస్ చూసి మరొకరు పొంగిపోతూ ఉంటారు. ఫెయిల్యూర్స్ వ‌స్తే ఒక‌రినొక‌రు తోడుంటారు.


రామ్ చరణ్ - రానా దగ్గుబాటి.. వీరిద్దరు స్కూల్ నుండి స్నేహితులు. ఇండ‌స్ట్రీలోకి వచ్చాక వీరి బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇద్దరూ ఒకరినొకరు బ్రదర్ లా పిలుచుకుంటారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ కు శ‌ర్వానంగ్ కూడా బెస్ట్ ఫ్రెండ్‌.


ఎన్టీఆర్ - రాజ‌మౌళి.. స్నేహానికి ఏజ్ తో సంబంధం లేద‌ని వీరిద్ద‌రూ నిరూపించారు. డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి, హీరోగా ఎన్టీఆర్ కెరీర్స్ ఒకేసారి ప్రారంభం అయ్యాయి. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్ కు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. తార‌క్‌, బ‌న్నీ `బావా` అంటూ ఒకరినొకరు పిలుచుకొని తమ స్నేహాన్ని చాటుకుంటూ ఉన్నారు.


ప‌వ‌న్ క‌ళ్యాణ్ - త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్నేహ‌బంధం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. చాలా ఏళ్ల నుంచి వీరి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా కొన‌సాగుతోంది. అదేవిధంగా చిరంజీవి, నాగార్జున మంచి మిత్రులు. రానా, నాని ఎప్ప‌టినుంచో క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు, ర‌జనీకాంత్ ప్రాణ‌స్నేహితులు. వెంక‌టేష్ దాదాపు అంద‌రితోనూ స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: