ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయి. అవి ఆ సినిమాలో స్టార్ హీరో నటించడం , అలాగే ఆ సినిమాకు స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించడం , అలాగే ఆ సినిమాలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ నటులు నటించి ఉండడం , అలాగే ఆ సినిమాకు స్టార్ టెక్నీషియన్స్ పని చేయడం , ఇలా అన్ని ఉన్నా కూడా కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండవు. కానీ కొన్ని సినిమాలపై మాత్రం అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొంటూ ఉంటాయి.

అలా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమాలు విడుదలకు ముందే సూపర్ సాలిడ్ రికార్డులను నెలకొల్పుతూ ఉంటాయి. ఇలాంటి రికార్డులు అనే కూలీ సినిమా ప్రస్తుతం నెలకొల్పుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఆమీర్ ఖాన్ ఈ మూవీలో క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి. ఈ మూవీ రేపు అనగా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ సేల్స్ ద్వారానే 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టండి. ఇంకా ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రీ సేల్స్ ద్వారా భారీ కలక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో ఈ సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల విషయంలో సూపర్ సాలిడ్ రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: