త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 ఏళ్లు. హీరోయిన్ గా 16 ఏళ్లు. తెలుగు, తమిళ్ లో టాప్ స్టార్ల దగ్గర నుంచి ఈ జెనరేషన్ హీరోలు చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇదోక రికార్డనే చెప్పాలి. ఇంతటి లాంగ్ కెరీర్ చాలా తక్కువమందికి మాత్రమే సాధ్యం. మొదటినుంచి గ్లామర్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే త్రిష తన అద్భుత అందంతో సౌత్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ స్టేటస్ అనుభవించింది.

 

గ్లామర్ విషయంలో త్రిష స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఇప్పటికీ ఫిట్ నెస్ కాపాడుకుంటూ తన అందాన్నికాపాడుకుంటోంది. స్లిమ్ గా ఉంటూ అందంలో తానెప్పుడూ క్వీన్ నే అని నిరూపిస్తోంది. ప్రస్తుతం అమ్మడు మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవుల్లో  త్రిష గ్రీన్ డ్రెస్ లో తీసుకున్న సెల్ఫీలో మెరిసిపోతోంది. వయసు ముప్పై అయిదుకు చేరుకున్నా తన పరువాల అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే త్రిష తన లేటెస్ట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూంటుంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే ఉంది. తమిళ్ లో ఆమెకు సినిమాలు ఉన్నాయి.

 

1999 లో మిస్ చెన్నై గా గెలిచిన నాటి నుంచే గ్లామర్ పై శ్రధ్దపెట్టింది. స్టార్ హీరోయిన్ రేసులో, అందం విషయంలో ఆ సమయంలో మరెవరూ ఆమె దరిచేరలేకపోయారు. గ్లామర్ డాల్ గా సౌత్ లో తనదైన ముద్రవేసింది. ఇప్పటికీ అందం విషయంలో తనదైన ముద్ర వేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: