రజినీకాంత్.. సౌత్ సూపర్ స్టార్.. మాస్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో.  రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంటుంది.  సినిమాల ద్వారా వచ్చే సంపాదనను తనకోసమే కాకుండా చాలా భాగం వరకు ట్రస్ట్ లకు ఇచ్చేస్తుంటాడు.  దానం చేయడంలో ఆయనది పెద్ద చేయి.  అందుకే ఆయన్ను అభిమానించే వ్యక్తులు కోకొల్లలు.  ప్రతి ఒక్కరు ఆయన్ను అభిమానిస్తూ.. ఆదరిస్తూ ఉంటారు.  


ఇదిలా ఉంటె, రజినీకాంత్ సినిమాకు వచ్చిన కొత్తల్లో చాలా కష్టపడ్డారు.  కండెక్టర్ గా పనిచేసే రోజుల్లో ఆయన స్టైల్ చూసి మెచ్చి.. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళమని సలహా ఇవ్వడంతో అయన ఇండస్ట్రీ వచ్చారు.  వచ్చిన కొత్తల్లో రజిని విలన్ వేషాలు వేశారు.  విలన్ గా మెప్పించారు.  విలన్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే భైరవి సినిమాలో హీరో వేషం వచ్చింది.  


మొదట రజిని కొంచెం ఆలోచించారట.  ఎందుకంటే.. రజిని తాను హీరో అవుదామని ఇండస్ట్రీకి రాలేదు.  విలన్ కావాలని వచ్చారు.  విలన్ గా సక్సెస్ అవుతున్న సమయంలో హీరో వేషం వచ్చింది.  భైరవి సినిమా చేయాల్సి వచ్చింది.  అయితే, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  తాను హీరో కావడానికి కారణమైన కథా రచయితా, నిర్మాత కలైజ్ఞానిని ఆయన నిత్యం గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు.  ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు.. ఎన్నో రికార్డులు.. 


రాణినికాంత్ ఇప్పుడు సూపర్ స్టార్, తలైవా.. ఇలా ఎన్నో బిరుదులూ ఉన్నాయి. తనను తాను నిరూపించుకున్నాడు.  ఇప్పుడు తనను హీరోగా పరిచయం చేసిన నిర్మాత కళైజ్ఞాని సన్మాన సభలో ఆయనకు ఇల్లు లేదని తెలుసుకున్న రజిని ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని నిర్ణయించినా ఆ అవకాశం ప్రభుత్వానికి ఇవ్వకుండా తానే స్వయంగా కలైజ్ఞానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  అది రజినీకాంత్ అంటే.  అందుకే ఆయన తమిళ ప్రజలకు దేవుడు అయ్యాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: