ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతుంది.   ఈ నేపథ్యంలో ఉదయం  హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. ఈ విషయం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు.  ఏడాది క్రితం అతడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే అతడిది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న కోణంలో దర్యాప్తు చేయగా ఈ మృతదేహం మిస్టరీ వీడిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఆ మృతదేహం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పాండుదిగా పోలీసులు గుర్తించారు.. పాండు ధరించిన దుస్తులు ఆధారంగా అతని కుటుంబసభ్యులు దాన్ని ధృవీకరించారు.  కాగా, పాండు అనే వ్యక్తి గత మూడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడని, ఆయన సోదరుడు కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందటం.. ఆపై వ్యవసాయ భూమిని అమ్మాల్సి  వచ్చిందని, అప్పటి నుంచి పాండు మానసికంగా చాలా కృంగి పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో పాండు  నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని గదిలోకి వెళ్లి తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇకపోతే పోలీసులు మృతదేహం వద్ద లభ్యమైన పురుగుల మందు డబ్బాను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం కనిపించకుండా  పోయిన పాండు ఇలా ఎముకల గూడుగా కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: