కరోనా వైరస్.. ఇంతటి దారుణమైన వైరస్ ను మనం గతంలో ఎన్నడూ చూసి ఉండం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అంత దారుణమైనది.. అంత రాక్షసత్వం ఉన్నదీ. అత్యంత వేగంగా ప్రపంచాన్నీ చుట్టేసింది ఈ కరోనా వైరస్. మన భారత్ లోకి ప్రవేశించి ప్రజలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. 

 

కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్ద అంత డీలా పడిపోయింది. చెప్పాలి అంటే ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6 వేలమంది మరణించారు. ఇంకా ఈ కరోనా వైరస్ బారిన ఏకంగా లక్ష 50 వేల మంది పడ్డారు. ఇంకా మన భారత్ లో అయితే ఇప్పటికే కరోనా కేసులు 89కి చేరుకుంది. నిన్న తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, పబ్స్ అన్ని క్లోజ్ అయ్యాయి.. ప్రజలను శుభ్రంగా.. అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ విజృంభించకుండా ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి... ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ఎఫెక్ట్.. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2పై కూడా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను బ్రిటన్ రాణి ఖాళీ చేసింది. ప్యాలెస్‌కు దూరంగా ఉన్న విండ్సర్‌ కోటకు బ్రిటన్ రాణి వెళ్లినట్లు ప్యాలెస్ వర్గాలు సమాచారాన్ని తెలిపాయి. 

 

కాగా విండ్సర్ కోటలో ఆమె ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు సమాచారం. కాగా.. బ్రిటన్ రాణి ఆరోగ్యంగానే ఉన్నారు.. ముందస్తు చర్యల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు అని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఏమైతేనేం.. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: