భారీ యుద్ధ విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో తాము ఉక్రెయిన్ కి మద్దతుగా ఉన్నామంటూ నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ముందుకు రావడం గమనార్హం. దీంతో మొన్నటివరకు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం తప్పదు అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. అయితే రెండు మూడు రోజుల్లో రష్యా యుద్ధానికి దిగబోతోంది అంటూ అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెప్పడం ప్రపంచవ్యాప్తంగా మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా ఏం జరగబోతుందో అని అంతా ఉత్కంఠగా మారిన నేపథ్యంలో తమ బలగాలను వెనక్కి పంపిస్తున్నాము అంటూ రష్యా స్టేట్మెంట్ ఇచ్చింది.
కొన్ని ఫోటోలను కూడా దీనికి సంబంధించి విడుదల చేసింది. దీంతో ఎలాంటి ఒప్పందం జరగకుండా అసలు రష్యా ఎందుకు వెనక్కి తగ్గింది అన్న చర్చ మొదలయింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల అమెరికా సరికొత్త విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. ఉక్రెయిన్ వెనక్కి తగ్గినట్లు డబుల్ గేమ్ ఆడుతోందని కొత్తగా సరిహద్దులో ఏడు వేలమంది సైనికులను మోహరించి అంటూ వీడియోలు ఫొటోలను కూడా విడుదల చేసింది అమెరికాఇంటెలిజెన్స్ విభాగం. అయితే గతంలో క్రిమియా విషయంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటించి మళ్ళి దూసుకొచ్చి యుద్ధం చేసిన రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహాన్ని రష్యా అమలు చేస్తుంది అంటూ అనుమానం వ్యక్తం చేసింది అమెరికా. దీంతో పరిస్థితి మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి