ఇటీవలే ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ తమ వశం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షేర్ ప్రాంతం మాత్రం ఒక సవాలుగా మారింది అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రస్తుతం పంజ్ షేర్ ప్రాంతంపై తాలిబన్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో తాలిబన్లకు లొంగేది లేదు ప్రాణాలు అయినా వదులుతాము కానీ వారికి తలవంచను అంటూ ప్రకటించిన తిరుగుబాటుదారులు తాలిబన్ల ఆటలకు అడ్డుకట్ట వేస్తారా లేదా అన్నది ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే పంజ్ షేర్ ప్రాంతంలో యుద్ధం చేస్తున్న తాలిబన్లు తాము ఇక ఆ ప్రాంతంపై ఆధిపత్యం సాధించాము అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి సంబరాలు చేసుకున్నారు.



 తాము ఇంకా తాలిబన్లకు లొంగి పోలేదని గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటామని అంటూ అటు తిరుగుబాటుదారులు స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవలే ఎన్ఆర్ఎఫ్ లీడర్ అహ్మద్ మసూద్ ఇచ్చిన స్టేట్మెంట్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. యుద్ధం ఇంకా ముగియలేదు.. వార్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. దెబ్బకుదెబ్బ ప్రాణానికి ప్రాణం తీసుకుంటాం.. తాలిబన్లపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం.. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం అంటూ ఎన్ఆర్ఎఫ్ లీడర్ మసూద్ ఇటీవలే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పినట్లుగానే అటు తిరుగుబాటుదారులు తాలిబన్లపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుగుబాటుదారుల దాడిలో ఏకంగా తాలిబన్ల సీనియర్ కమాండర్ హతమయ్యాడు. ఇక మరో 13 మంది తాలిబన్ కీలక నేతలు కూడా హతమైనట్లు తెలుస్తోంది.


 సింహ గర్జన అని పేరు ఉన్న ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారులు అందరు నిజంగానే సింహం గర్జించినట్లుగానే తాలిబన్ల పై విరుచుకుపడుతున్నారు.  ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పౌరులందరికీ కూడా పిలుపునిచ్చారు తిరుగుబాటుదారులు.  తాలిబన్లపై   తిరగబడింది.. తిరుగుబాటు బావుటా ఎగుర వేయండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇక అందరూ పోరాటానికి సిద్ధం కండి చావో రేవో తేల్చుకోండి అంటూ పిలుపునిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని  తాము వశం చేసుకున్నావు అంటూ ఇటీవల తాలిబన్లు చేసిన ప్రకటనను సైతం  ఖండించారు తిరుగుబాటుదారులు.  దీంతో అటు తాలిబన్లకు ఊహించని షాక్ తగులుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: