కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ధీటుగా సమాధానం చెప్పే సత్తా ఉన్న నేత ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. హోరాహోరీగా జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు దీదీ. వీల్ ఛైర్ టూ సీఎం ఛైర్ అన్నట్లుగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక సాగింది. చివరికి ఉప ఎన్నికల్లో సైతం దీదీని ఓడించేందుకు కమలం పార్టీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో బీజేపీని పట్టుకోవాలనే లక్ష్యంతో భారీ స్కెచ్ వేసినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ బిజెపియేతర పార్టీలతో కలిసి మెగా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ అధినేత శరత్ పవర్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో మమతా బేటీ అయ్యారు.

అదే జోరులో ఉన్న మమత... బిజెపి అధికారంలో ఉన్న గోవా రాష్ట్రం పై కన్నేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మమత ఇప్పటి నుంచి స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలను గోవా పంపిన మమతా... రాష్ట్రంలో ప్రముఖులతోపాటు కీలక నేతలను కూడా టీఎంసీలో చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు. గోవాలో మనోహర్ పారికర్ లేని లోటు బిజెపిలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంప్యైనర్ ల కోసం కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టారు. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన దీదీ... గోవా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త నినాదం తీసుకొని వచ్చింది. బెంగాల్ లో తన విజయానికి బాటలు వేసిన ఖేలా హోబే నినాదాన్ని మరోసారి గోవాలో ప్రయోగిస్తోంది. అలాగే బెంగాల్, గోవా మధ్య సారూప్యత ఉండే ఫుట్ బాల్, చాపలు అంశాలను తెరపైకి తీసుకుని వచ్చింది. టి.ఎం.సి కీలక నేత డెరెక్ ఓబ్రయిన్ తో పాటు మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ ప్రసూన్ బెనర్జీలకు గోవా బాధ్యత అప్పగించారు మమత. వీరిద్దరూ వారం రోజుల పాటు గోవాలో విస్తృతంగా పర్యటించి అక్కడ పరిస్థితులపై ఓ నివేదికను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అందివ్వనున్నారు. గోవాలో టీఎంసీ గెలవాలంటే ఏం చేయాలనే సలహాలను కూడా ఇద్దరు నేతలు సూచించనున్నారు. ఏది ఏమైనా... ఇప్పటికే తూర్పు తీరంపై సత్తా చాటిన మమత ఇప్పుడు పశ్చిమ తీరం పై కూడా కన్నేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: