కాంగ్రెస్ పార్టీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీని జాతీయ అధ్యక్షుడుగా ప్రకటిస్తారన్న ఊహాగానాలకు దాదాపు ఇక తెరపడినట్టే.. రాహుల్‌గాంధీ ఇప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన అధ్యక్ష పీఠం ఎక్కే అంశం మరోసారి వాయిదా పడిందనే చెప్పాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక అంశాన్ని ఏఐసీసీ మరోసారి వాయిదా వేసింది. వచ్చే ఏడాదే సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం వస్తోంది.

 
2022 సెప్టెంబర్‌ లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకూ  కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. అందుకే సోనియా గాంధీ తాత్కిలిక అధ్యక్షురాలు కాకుండా... అధ్యక్షురాలిగా సంభోదించాలని  పార్టీల సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపన్యాసం ఇచ్చారు. అందులో ఆమె తాను తాత్కాలిక అధ్యక్షురాలు కాదు.. పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు  స్పష్టం చేసినట్టు తెలిసింది.


ఈ పరిణామాలు చూస్తే రాహుల్ గాంధీ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేశారని భావించొచ్చు.. ఎందుకో మొదటి నుంచి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయనకు గతంలోనే ఈ పదవి అప్పగించినా ఆయన దాన్ని వదులుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కాకుండా ఇతరులకు ఆ పదవి అప్పగించే ఆలోచన సోనియా గాంధీ చేయడం లేదు. అందుకే మధ్యే మార్గంగా సోనియా గాంధీయే ఇంకొన్నాళ్లు ఆ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.


ఈ విషయాన్ని స్పష్టం చేసిన సోనియా.. ఎవరైనా, ఏవిషయంపై అయినా మాట్లాడాలి అనుకుంటే తనతో నేరుగా మాట్లాడాలని తెలిపారు. మీడియా ద్వారా మాట్లాడవద్దంటూ హితవు పలికారు సోనియా. సో.. రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ వరకూ కాంగ్రెస్ అధ్యక్షుడు కాడన్నమాట. మరి ఆ తర్వాతైనా పగ్గాలు చేపడతారా లేదా అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: