కొంపల్లి ఆస్పైసియాస్ కన్వెన్షన్ సెంటర్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపధ్యంలో కాస్త ఆసక్తి నెలకొంది. నేడు రేపు రెండు రోజుల పాటు మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది తెలంగాణా కాంగెస్ పార్టీ. 119 నియోజక వర్గాల నుంచి దాదాపు 1200 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది పార్టీ నాయకత్వం. ఉదయం 10.45 గంటలకు కు జెండావిష్కరణ తో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పార్టీ పటిష్టత, సిద్ధాంతాలు అనే అంశాలపై మాట్లాడుతారు అని పార్టీ నేతలు చెప్పారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి పదవులు పొందిన వారు పార్టీని మోసం చేసి పోయారు అని మండిపడ్డారు. గ్రామస్థాయిలో నేతలు కష్ట పడితేనే కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ సభ్యత్వంలో టీపీసీసీ ముందుంది అన్నారు రేవంత్ రెడ్డి. పోడు భూముల మీద పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్ జాకీపెట్టినా లెవదని ఓ సన్నాసి అంటున్నాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి సన్నాసి మాటలకు ఊతం ఇచ్చేలా మనం ప్రవర్తించొద్దు అని ఆయన కోరారు.

ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ తో పని చేయాలి అని విజ్ఞప్తి చేసారు. ప్రతీ కార్యకర్త సోనియా మాల వేసుకోవాలి అని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బందీ అయింది అంటూ వ్యాఖ్యలు చేసారు. బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలి అని కోరారు. 30లక్షల మెంబర్ షిప్ చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అని విజ్ఞప్తి చేసారు. పైసల కోసం పార్టీని వీడిన వారు చచ్చిన వారితో సమానం అని అన్నారు. అత్యధికంగా మెంబర్ షిప్ చేసిన మండల అధ్యక్షుల ను రాహుల్ గాంధీతో సన్మానం చేపిస్తా అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts