తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో దృష్టి పెడుతున్న నేపథ్యంలో కొంతమంది కీలక నాయకులను కలవాల్సిన అవసరం ఉంది అనే మాట వాస్తవం. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ లను కలవాల్సిన అవసరం ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కాస్త ప్రాధాన్యత ఉన్న నేతలు అనే విషయం అందరికీ తెలిసిందే. ములాయం సింగ్ యాదవ్ కు అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉన్న కీలక నేతలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

ములాయం సింగ్ యాదవ్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లకుండా రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇక ములాయం సింగ్ యాదవ్ పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రచారం కూడా ఈ మధ్య కాలంలో మొదలైంది. ఇటీవల వచ్చిన సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ గణనీయంగా బలపడిందని దాదాపుగా వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాలలో గెలుచుకునే అవకాశం ఉంటుందనే వార్తలు వినబడుతున్నాయి.

ఇక జాతీయస్థాయి రాజకీయాల విషయంలో ములాయం సింగ్ యాదవ్ కు బలమైన పట్టు ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయనను ఎంత వరకు వాడుకోగలరు ఏంటి అన్న దానిపైనే కొన్ని కొన్ని అవకాశాలు ఆధారపడి ఉంటాయి అనే మాట వాస్తవం. జాతీయ స్థాయి రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ కొన్నిసార్లు కీలకపాత్రలు పోషించిన ఆ తర్వాత మాత్రం ఇబ్బంది పడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కు ములాయం సింగ్ యాదవ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం కచ్చితంగా ములాయం సింగ్ యాదవ్ సీఎం కేసీఆర్ తో కలిసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: