రాజ‌ధాని ఏద‌యినా స‌రే రాజు మాత్రం అతడే! రాజ‌ధాని ఎక్క‌డున్నా స‌రే ఆయ‌న పేరు మాత్రం మార్మ్రోగి పోవాల్సిందే! అవును! అంద‌రి క‌న్నా భిన్నం. అంద‌రి క‌న్నా ఉన్న‌తం కూడా! జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఉన్నంత కాలం భిన్నం. ఆర్థికంగా సమున్న‌త రీతిలో ఉన్నంత కాలం ఉన్నతం. అవును ఆయ‌నే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. చిత్తూరు రెడ్డి. ఏపీ క్యాబినెట్ లో ఆయ‌న స్థానం గురించి స్థాయి గురించి మాట్లాడాలంటే ఓ పెద్ద వ్యాస‌మే రాయాలి. అంత‌టి స్థాయి కానీ స్థానం కానీ ఇవాళ బొత్స‌కు కూడా లేవు.

పైకి మాట్లాడ‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా సొంత ప‌నులు కూడా చేయించుకోలేని అస‌మ‌ర్థ‌త‌లో చాలా మంది మంత్రులు ఉన్నా కూడా, పెద్దిరెడ్డి మాత్రం త‌న‌దైన శైలిలో రాజ‌కీయం నడుపుకుంటూ వ‌స్తున్నారు. ఏపీ స‌ర్కారులో మంచి పేరు తెచ్చుకుని అంద‌రి క‌న్నా భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైసీపీకి ఫండింగ్ స‌మ‌కూర్చ‌డంలో ముఖ్యంగా ఆర్థిక ప్రోద్బ‌లం అందించ‌డంలో సాయిరెడ్డి క‌న్నా చురుగ్గ ఆయ‌నే ఉంటున్నారు. దీంతో స‌హ‌జంగా క‌డ‌ప రెడ్డి క‌న్నా ఈ చిత్తూరు రెడ్డే జ‌గ‌న్ కు కావాల్సిన వారయ్యారు. అంద‌నంత ఎత్తుకు ఎదిగారు.

ఓ విధంగా చంద్ర‌బాబును మ‌రో విధంగా జ‌గ‌న్ ను ఇద్ద‌రినీ ఏక‌కాలంలో నిలువ‌రించే శ‌క్తి ఆయ‌న‌దే! ముఖ్యంగా మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దుకు సంబంధించి కూడా అంద‌రి క‌న్నా ముందే నోరు తెరిచారు ఆయ‌న. ఇది ఇంట‌ర్వెల్ మాత్రమే క్లైమాక్స్ సీన్ వేరుగా ఉంటుంది. మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పారు కూడా! ఆ విధంగా ఒక‌నాటి త‌న వైరి వర్గం అయిన చంద్ర‌బాబుకు
క‌డ‌ప రెడ్ల క‌న్నా ముందే ఈ చిత్తూరు రెడ్డి వార్నింగ్ ఇచ్చిన వారయ్యారు. అంతేకాదు మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దుకు సంబంధించిన నిర్ణ‌యాన్ని అసెంబ్లీ వేదిక గా ప్ర‌క‌టించ‌క‌ముందే త‌మ ప్ర‌భుత్వం ఇక‌పై ఏం చేయ‌బోతుందో చెప్పేశారు. ఆవిధంగా  
ఆయ‌న తీవ్ర ఉత్కంఠ‌త‌కు ఓ విధంగా తెర‌దించార‌నే చెప్పాలి అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ త‌రుణంలో పెద్ది రెడ్డి
అన్నీ తానై న‌డిపిన విధానం కూడా ఆ ప్ర‌క‌ట‌న సారాంశం నుంచే అర్థం చేసుకోవ‌చ్చ‌ని కూడా చెబుతున్నారు. 3 రాజ‌ధానుల ఏర్పాటు అన్న‌ది ఎలా ఉన్నా, ఒక‌వేళ రేప‌టి వేళ అది సాధ్యం కాక‌పోయినా జ‌గ‌న్ అనే వ్య‌క్తి స్థాయి వ్య‌క్తిగా పెద్దిరెడ్డి త‌న‌ని తాను
ఫోక‌స్ చేసుకుని చేస్తున్న రాజ‌కీయం సాయిరెడ్డి క‌న్నా భిన్నంగా ఉంది. ఆ మాట‌కు వ‌స్తే స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి క‌న్నా కూడా
విభిన్నంగానే ఉంది. ఓవిధంగా క‌డ‌ప రెడ్ల క‌న్నా ఈ చిత్తూరు రెడ్డే మ‌రో అడుగు చొర‌వ‌తో ముందుకు వేసి అన్నీ తానై న‌డిపిన వైనం అన్న‌ది గతంలో ఎన్న‌డూ లేనేలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp