తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో ఒక ప్రయోగం చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనుంది దేవుడికే ఎరుక అని తాను చెబుతుంది నిజమని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కమిటీ మాత్రమే వేసిందని ఆంధ్రప్రదేశ్ లో మూడు నెలలకో, ఆరు నెలలకో ఏమవుతుందో బయటపడుతుందని కేసీఆర్ అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ విలీనం గురించి వ్యాఖ్యలు చేసిన కొంత సమయంలోనే ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేస్తూ సీఎం జగన్ వర్కింగ్ గ్రూప్ ను నియమించారు. వర్కింగ్ గ్రూప్ కి మరో 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ లో రవాణా, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయ శాఖల ఉన్నతాధికారులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 
ఈ వర్కింగ్ గ్రూప్ పే స్కేల్, జీతాల చెల్లింపులు మొదలైన అంశాల గురించి విధివిధానాలను ఖరారు చేయనుందని తెలుస్తోంది. వర్కింగ్ గ్రూప్ పోస్టులు, ప్రజా రవాణా శాఖ ఏర్పాటు గురించి కూడా విధివిధానాలు ఖరారు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ విలీనం గురించి కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన కొంత సమయంలోనే ఏపీ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ నియమిస్తూ జీవో జారీ చేయటం కేసీఆర్ కు షాక్ అని చెప్పవచ్చు. 
 
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం 100 శాతం అసంభవం అని  కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ దివాళా తీసిందని నా దృష్టిలో ఆర్టీసీ పని అయిపోయినట్లే అని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు... ఆర్టీసీ ముగింపే అని అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని దీనిపై ఐదారు రోజులలో నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: