ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లో నాగబాబు ప్రస్తానం ముగిసింది. ఆయన శుక్రవారం ఎపిసోడ్ తో జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తున్నారు. ఇవాళే ఎపిసోడే ఆఖరు. దాదాపు ఏడేళ్ల పాటు ఆయన ఈ ప్రముఖ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్తనారు. ఆయన బయటకు రావడంపై అనేక పుకార్లు వినిపించాయి. వాటికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఆయనే ముందుకు వచ్చారు.

 

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. తాను షో నుంచి వెళ్లిపోవడం గురించి సినీ ఇండస్ట్రీ, సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై నాగబాబు స్పష్టతనిచ్చారు. ‘‘జబర్దస్త్‌’ ఒక సుదీర్ఘ ప్రయాణం. 2013 నుంచి 2019 ఈ రోజు వరకూ నా ప్రయాణం కొనసాగింది. ఇది నాకు హ్యాపీ, ఎమోషనల్ జర్నీ. నేను ‘జబర్దస్త్‌’ మానేయడానికి ఏవేవో కారణాలు బయటకు వస్తున్నాయి. ఊహాజనిత వార్తలు సృష్టించడం నాకు ఇష్టం లేక మాట్లాడాల్సి వస్తోంది.

 

ఏదైనా విషయాన్ని వివాదాస్పదం చేయడం నాకు ఇష్టం ఉండదు. అలా చేసి నేను పొందే లాభం కూడా లేదు. ‘జబర్దస్త్‌’కు వ్యతిరేకంగా ఇప్పటివరకూ నేను బయట మాట్లాడింది లేదు. ఈరోజు, రేపటి ఎపిసోడ్‌లతో ‘జబర్దస్త్‌’లో నా ప్రయాణం ముగిసింది. ఇక నుంచి నేను కనిపించను. ఈ షోను నాకు నేనుగా మానేసే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఒక కార్యక్రమం అయినా, జర్నీ అయినా ఎక్కడో ఒక చోట పూర్తి కావాలి. మల్లెమాల శ్యాంప్రసాద్‌గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కేవలం అవి ఆలోచనాపరమైన విభేదాలు అనవచ్చు. ముఖ్యంగా అవి వ్యాపారానికి సంబంధించినవి. శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి, ఈటీవీ వారికి కృతజ్ఞతలు.. అని తెలిపారు నాగబాబు.

 

జబర్దస్త్ కొన్నేళ్లుగా టీవీ రేటింగుల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈటీవీ ప్రభ తగ్గిపోతున్న రోజుల్లో మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ ఆధ్వర్యంలో వచ్చిన జబర్దస్ వస్తూ వస్తూనే పెద్ద హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: