గత నెల 27 వ తారీఖున దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార హత్య కేసులో నిందితులుగా తేలిన నలుగురు యువకులను ఈ రోజు ఉదయం తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. అసలు ఆ రోజు సంఘటన స్థలంలో జరిగిన విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన పోలీసులు. ఆ సమయంలో నిందితుల్ని అక్కడికి తీసుకెళ్లారు, కానీ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ నలుగురు. ఆ సమయంలో వేరే గత్యంతరం లేక తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేసి కాల్చి చంపవలసి వచ్చింది.

 

ఈ విషయం వార్తల్లోకి వచ్చిన వెంటనే అందరు కూడా తెలంగాణ పోలీసులు ఎంతో అభినందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ సమస్య వస్తే దేవుడు  పంపించేది కూడా పోలీస్ నే అని గుర్తు చేశారు. కానీ, ప్రజలు ఇంత సంతోషిస్తున్న సమయంలో హైదరాబాద్ పోలీసులకి ఒక కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం అసలు మన పోలీసులు దిశ రేపిస్టులు వారి మీద తిరుగుబాటు చేస్తే ఆపలేని పరిస్థితిలో ఉన్నారా..??? అసలు ఎన్ కౌంటర్ చేయడానికి గల కారణాలు ఏమిటి అవి ఎలా ఏర్పడ్డాయి...?? అసలు పోలీసులు అక్కడ వెళ్లిన పని రికార్డు చేశారా లేదా..?? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మీడియా వర్గాలు చర్చింకుంటున్నాయి.

 

ఇంకో విషయం ఏమిటంటే ప్రజలు ఎంతో సంతోషిస్తున్న వేళ మానవ హక్కుల సంఘాలు మళ్ళీ తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆలోచన కూడా మొదలైంది. కానీ ఎవరైనా మానవ హక్కుల సంఘం వారు ఎవరైనా దీనిని తప్పు అని వాదిస్తే వారికి ఖచ్చితంగా ప్రజల నుంచి ఎదురుదాడి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: