ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు మొదలు అయ్యాయి. అసెంబ్లీ లో మహిళల భద్రత గూర్చి హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇటీవల తెలంగాణ లో జరిగిన "దిశ " అత్యాచారం మరియు హత్య ఘటన గూర్చి ప్రస్తావిస్తూ చిలకలూరిపేట పేట ఎమ్మెల్యే 'విడదల రజిని 'అందరిని ఆలోచింపచేసేలా మాట్లాడారు.

మద్యం కూడా అత్యాచారాలు జరగడానికి ఒక కారణం అని, గత ప్రభుత్వం హయాములో మద్యం అమ్మకాలు  జోరుగా జరిగాయి అని అన్నారు. మహిళలు చిలకలూరిపేట హైవే బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్లాలంటే బయపడేవాళ్ళని, వైస్సార్ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు తగ్గాయని మహిళలు రాత్రి ఎనిమిది తరవాత కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయగలుగుతున్నారని ఎమ్మెల్యే రజిని తెలిపారు.

 


మహిళల విషయంలో అత్యాచారాలు జరగకూడదంటే సమాజం మైండ్ సెట్ అనేది మారాలని, అలా మార్పు రావాలంటే రాజకీయ నాయకులు కూడా తమవంతు కృషి చేయాలని తెలిపారు. భగవద్గీత, ఖురాన్, బైబెల్ చదివిన కాని వాటి ద్వారా మనం నేర్చుకున్న మంచిని, విలువలని , నిజజీవితంలో సరిగా అనుసరించడం లేదు అని భావోద్వేగానికి గురయ్యారు. సమాజంలో మార్పుని తీసుకురావాలి.


ఒకవేళ ఏదన్న సంఘటన జరిగితే వెంటనే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లను ప్రవేశపెట్టాలి అన్నారు. న్యాయం త్వరగా జరిగేలా చూడాలన్నారు. ఫోరెన్సిక్ లాబ్స్ ని పెంచాలన్నారు. తెలుగుదేశం పార్టీ హయం లో కుప్పం నియోజకవర్గంలోని ఇరువర్గాల పార్టీల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళని వివస్త్రను చేశారన్న విషయం గుర్తుచేశారు.

మహిళల పట్ల చిన్నచూపు, వివక్ష బేధం లేకుండా, గౌరవంగా చూసే రోజులు రావాలని అన్నారు. సిఎం జగన్ గారు మహిళల పట్ల కొత్త రూల్స్ తీసుకువచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నారు అన్నారు. చంద్రబాబు మహిళల కోసం ఏమి చేసారు అని ప్రశ్నించారు. లోకేష్ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేదు అని అన్నారు. గత ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని, కాని వైస్సార్ ప్రభుత్వo అలా కాదని మహిళలకి అండ గా ఉంటుందని తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: