మూడు రాజధాని విషయం జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుండడంతో తమ ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పెట్టుబడులను ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టే బదులు తమ ప్రాంతానికే రాజధాని వచ్చింది కాబట్టి అక్కడే పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించవచ్చని, ఉపాధి పొందవచ్చని అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను తీసుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కారణంగా ప్రజలు దేశంలోని అనేక ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలస వెళుతూ ఉంటారు.


ఎప్పటి నుంచో ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. వీరికి సరైన ఉపాధి అవకాశాలు లేక ఇలా వలసబాట పడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా వలస పోతుంటారు. కానీ ఇప్పుడు పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేయడంతో ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటంతో స్థానికంగానే ఈ ప్రాంతంలో ఉపాధి పెద్ద ఎత్తున దొరికే అవకాశం లభించే అవకాశాలు ఉండడంతో వలసలు నివారణకు మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. 

 

రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చాలా కాలంగా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. కరువు కారణంగా ఇక్కడ కూడా వలసలు ఎక్కువగానే ఉన్నాయి. చెప్పుకోడానికి సీమ అని గొప్పగా ఉన్నా ఉపాధి మాత్రం దొరకకుండా ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్నామనే భావన ఇక్కడ ప్రజల్లోనూ బలంగా ఉంది. ఇప్పుడు జగన్ నిర్ణయం కారణంగా సీమ జిల్లాల్లో అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చెందకుండా కేవలం ఒక్క అమరావతికి రాజధానిని పరిమితం చేయాలని తెలుగుదేశం పార్టీ హడావుడి చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: