రోజుకో ఘటన వెలుగులోకి వస్తుంది.. ఎక్కడో ఒక చోటా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడుతున్నారు.. నిన్నటికి నిన్న హైదరాబాద్ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని తరలిస్తూ నలుగురు వేరు వేరు ప్రయాణికులు పట్టుబడ్డారు.   

 

ఏకంగా 4కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మస్కట్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. అయితే ఆ నలుగురు ఇద్దరు కడుపులో బంగారం దాచుకోగా మరో ఇద్దరు నల్లటి టేప్ లో చుట్టి ఒవేన్ లో పెట్టి తీసుకొచ్చారు. 

 

ఇప్పుడు తాజాగా విశాఖ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాగా. విదేశాల నుండి అక్రమంగా బంగారం తలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. 800 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కళ్లుగప్పి  బంగారం తరలించేందుకు ఈ ఇద్దరు  నిందితులు ప్రయత్నించారు. 

 

అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు నిర్వహించడంతో బంగారం అక్రమంగా తరలిస్తున్న విషయం బయటపడింది. కేసు నమోదు చేసినా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా రోజుకో అక్రమం బయట పడుతుంది. వారనికి ఇద్దరైనా ఇలా అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. సినిమాలలోకి ఉండే సీన్లను గుర్తు చేసేలా అక్రమాలకు పాల్పడుతున్నారు.  

 

గతంలో కూడా ఈ తరహా బంగారం తరలింపుకు ప్రయత్నం చేసి ఎందరో వ్యక్తులు కేసుల పాలయ్యారు. అయినప్పటికీ దుబాయ్ , మస్కట్ తదితర ప్రాంతాల నుండి వచ్చేవారు దొడ్డి దారిన బంగారం తీసుకురావటం మాత్రం మానటం లేదు. ఫలితంగా ఎయిర్ పోర్ట్ పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కవుతున్నారు. కాగా సినిమాలలో ఉండే సీన్లను గుర్తు చేసేలా అక్రమాలకు పాల్పడుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: