రాజకీయాల్లోనే మాటలు మార్చే వారుంటారు అనుకుంటే, సినిమాల్లో వారు కూడా పొలిటికల్ వార్‌లో వేళ్లుపెడుతూ మాట్లాడటం ఈ మధ్యకాలంలో అందరికి తెలిసిన విషయమే. అసలు రాజకీయం వేరు, సినిమా వేరు అని కొందరంటే, రాజకీయం సినిమా ఒకటే అని మరికొందరు అంటారు. వారు రంగు పూసుకోకుండా నటిస్తే, వీరు రంగేసుకుని నటిస్తారు అనే మాటలు అప్పుడప్పుడు వినిపిస్తాయి. ఇకపోతే మొన్నటి వరకు జబర్దస్త్ షో విషయంలో పలు వివాదస్పద వాఖ్యలు చేసిన నాగబాబు, ఇప్పుడు మళ్లీ పొలిటికల్ వైపు మళ్లాడు.

 

 

రాజకీయంగా ఎంతగా కించపరచుకున్న ఎక్కువగా పొలిటికల్ మ్యాటర్లో నాగబాబు ఇన్వాల్ కాడంటారు. కానీ మెగా ఫ్యామిలీని మాత్రం ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం. అటు రాజకీయంగా అయినా సినిమాల పరంగా అయినా వెంటనే నాగబాబు స్పందించడం అందరికి తెలిసిన విషయమే. ఇకపోతే సడెన్‌గా నాగబాబు చంద్రబాబును పొగడటంతో ఇప్పుడు ఈ టాపిక్ వైపు అందరి దృష్టి మళ్లింది.

 

 

ఇక పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ కంటే చంద్రబాబే ‘ఆ’ విషయంలో బెటర్ అన్నారు. ఇదే కాకుండా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పవన్ కల్యాణ్.. బీజేపీతో జతకట్టారని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లుగా, నాగబాబు చెప్పుకొచ్చారు.

 

 

ప్రస్తుతం జగన్ తీసుకునే నిర్ణయాలు ఎవరికి అర్ధం కాని విధంగా ఉన్నాయని, అదే టీడీపీ ప్రభుత్వం వున్నపుడు చంద్రబాబు చేసే పని ముందుగానే తెలిసేదని, వ్యాఖ్యానించారు.. ఇక ఏదైనా మంచిపనిని ప్రారంభించాలన్నా, చేయాలన్నా, ముందుగా అనుభవజ్ఞులు అయినా పెద్దవారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని నాగబాబు పేర్కొన్నారు.

 

 

ఇంతకు నాగబాబు చంద్రబాబుని పొగిడినట్టా, లేక జగన్‌కు చంద్రబాబు అడుగుజాడల్లో నడవమని చెప్పినట్లా అని అసలు విషయం అర్ధం కాక, నాగబాబుని పూర్తిగా అర్ధం చేసుకో లేక కొందరైతే బిత్తిరి చూపులు చూస్తున్నారట.. ఏమో బాబు.. ఆడవారి మాటలకు అర్ధాలే వేరయా అన్నట్లుగా, మగవారి మాటలకు అర్ధాలే మారునయా అని అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: