కరీంనగర్ జిల్లా అలగనూరు లో జరిగిన కారు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారు ప్రమాదంలో చనిపోయింది పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులుగా పోలీసులు గుర్తించారు. మృతులు ఎమ్మెల్యే సోదరి, బావ, ఆయన మేనకోడలు మరణించినట్టు తెలిసింది. గత నెల 27న పెద్దపల్లి నుంచి హైదరాబాద్ కుటుంబం కారులో బయల్దేరింది. ఉదయం సమయంలో కుటుంబం కారు (ఏపీ 15, బీఎన్ 3438) కి బయల్దేరినట్టు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ దాటిన తర్వాత కాకతీయ కెనాల్ వద్ద ప్రమాదం జరిగింది. 

 

రేణిగుంట టోల్ గేటు ఇవతల ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వేగంగా కారు కెనాల్ లోకి దూసుకువెళ్ళినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 20  రోజుల తర్వాత కారు కొట్టుకు వచ్చింది. అయితే ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేదని పోలీసులు అంటున్నారు. అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల పాత్రపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కాంటాక్ట్ చేయలేదని సమాచారం. దీనితో కుటుంబంలో గొడవలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. 

 

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసలు కుటుంబంలో ఏ గొడవలు లేవని అన్నారు. తరుచూ విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని ఆయన వివరించారు. అయితే 20 రోజుల తర్వాత కూడా ఎవరూ ఇప్పటి వరకు పోలీసులను సంప్రదించలేదు. ఏమైనా పగలు ఉన్నాయా ఎవరైనా చేసారా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం కాలవలో కొట్టుకువచ్చిన కారుని కొంత మంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో కారులో మూడు మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి కారు నెంబర్ ఆధారంగా మృతులను గుర్తించారు. దీనితో ఎమ్మెల్యే కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: