సాధారణంగా నైట్‌ క్లబ్‌ అంటే ఎలా ఉంటుంది. అర్థం కానీ ఇంగ్లీష్‌ పాటలు ప్లే చేస్తూ, మనుషుల ముఖాలు కనిపించీ కనిపంచకుండా ఉండే గుడ్డి వెలుతురూ, మందు మాసంతో యువత చిందులేస్తూ ఉంటారు. పాశ్చాత్య దేశాలతో పాటు ఇండియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇండియాలో పంజాబీ, హిందీ పాటలు కూడా వినిపిస్తుంటాయి. మధ్యం మాసం మాత్రం కామన్‌. కానీ ఇలాంటి రోటీన్‌ ఫార్ములాకు భిన్నంగా ఓ ఆద్యాత్మిక క్లబ్‌ కూడా ఉంది.

 

అవును నిజంగానే ఓ ఆద్యాత్మిక నైట్‌ క్లబ్‌ ఉంది. అది కూడా మన దేశంలో కాదు. మన దేశానికి సంస్కృతికి వేల మైళ్ల దూరంలో అర్జంటీనాలో ఓ డిఫరెంట్ నైట్ క్లబ్‌ ఉంది. ఆ నైట్ క్లబ్‌లో యువత సంస్కృత పాటలకు డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో గ్రూవ్‌ అనే నైట్ క్లబ్‌ ఉంది. ఆ క్లబ్‌లో గణేష శరణం, గోవిందా గోవిందా, జై జై రాధా రమణ్‌ హరి బోల్‌, జై కృష్ణ హరే లాంటి భక్తి గీతాలకు అంతా డ్యాన్స్‌ చేస్తారు.

 

మరింత ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే ఈ నైట్ క్లబ్‌కు రోజు 800 మంది వరకు వస్తుంటారు. కొంత కాలం కిందట విశ్వనాధన్‌ అనే ఓ భారతీయుడు అర్జంటీనాలోని ఈ నైట్ క్లబ్‌ను సందర్శించాడు. ఆయన అక్కడి వాతావరణానికి భారతీయులకు తెలియజేశాడు. భక్తిలకు డ్యాన్స్‌లు చేయటమే కాదు. ఆ క్లబ్‌లో స్మోకింగ్ చేయడానికి, మధ్యం సేవించడానికి కూడా అనుమతి లేదు. డ్రగ్స్‌ లాంటివైతే అసలు కనిపించవు.

 

అంతేందుకు మాసం, చేప లాంటి వాటిని కూడా అనుమతించరు. సాఫ్ట్ డ్రింక్స్‌, ఫ్రూట్ జ్యూస్‌, శాఖహార భోజనాన్ని మాత్రమే అనుమతిస్తారు. మన దేశంలో సాంప్రదాయాలను మరిచిపోతుంటే.. ఎక్కడో వేల మైళ్ల దూరంలో భారతీయ సాంప్రదాయాలకు అంత విలువ ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: