గత కొన్ని రోజులుగా పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో  ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వెంటనే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎంతో మంది ముస్లింలు రోడ్లపైకి చేరి భారీ ఎత్తున ఉద్రిక్తత ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో పురుషోత్తముడైన చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేలా ఎంతో మంది ప్రేరేపిస్తున్న ఉగ్రవాద జంట కలకలం రేగింది . ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్న దంపతులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఆదివారం ఓ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. జహాన్ జీవ్  సామి, అతని భార్య హిండా  బషీర్ బేగ్  అనే ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

 

 అయితే వీరిద్దరినీ విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ భార్య భర్త నిందితులు ఇద్దరు... సీనియర్ ఐఎస్  సానుభూతిపరులు పై సంప్రదింపులు జరుపుతూ వచ్చారని... దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు చేసేలా  వీరిద్దరు పలువురు ముస్లిం యువకులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ఈ ఇద్దరు దంపతులు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఐ mఎస్ సభ్యులతో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్న ట్లు కూడా సమాచారం ఇక వీరిద్దరి అరెస్టును ధృవీకరించిన ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ప్రమోద్ సింగ్ మాట్లాడుతూ.. ఓక్లా లోని  జామియా నగర్ నుంచి... ఈ ఉగ్రవాద జంట పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రేరేపిస్తూ అందరినీ ప్రభావితం చేస్తున్నట్లు  అంటూ తెలిపారు. 

 

 పౌరసత్వ సవరణ చట్టం సహా ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా... ఎక్కువమంది ఆకర్షించి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లను జరిపే విధంగా ప్రేరేపిస్తే ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ముఖ్యంగా ఎక్కువ మత  ప్రేమ కలిగిన వారిని... టార్గెట్ చేస్తూ వాళ్ళని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు చేసేలా ఆకర్షించడం ఆ తర్వాత అల్లర్లకు ఆకర్షించటమే  లక్ష్యంగా  ఇండియన్ యునైటెడ్ ముస్లిం అనే ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ను  ఈ జంట నడుపుతోందని కమిషనర్ ప్రమోద్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాలలో ప ఉగ్రవాద భార్యాభర్తలిద్దరూ ఆత్మాహుతి దాడులకు కూడా ఈ పథకం పన్నినట్లు గా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: