ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాల‌ను హ‌రించేస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఇప్ప‌టికే 13 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు మ‌న‌దేశంలో కూడా కోర‌లు చాస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఇప్ప‌టికే ఎనిమిది మంది మృతి చెందారు. ఇక ఒక్క మ‌హారాష్ట్రంలోనే క‌రోనా విజృంభిస్తోంది. ఇక్క‌డ ఇప్ప‌టికే 89 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో క‌రోనా కేసులు 22 క్రాస్ అయ్యాయి. ఈ సంఖ్య ఏపీలో 5 గా ఉంది. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌తో 13 రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి

.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా చైనా త‌ర్వాత ఇట‌లీని స‌ర్వ‌నాశ‌నం చేస్తోంది. క‌రోనా దెబ్బ‌తో ఇట‌లీ స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డంలో విప‌ల మ‌వ్వ‌డంతో ఇప్ప‌టికే అక్క‌డ ఏకంగా 5 వేల మందికి పైగా చ‌నిపోయారు. చివ‌ర‌కు శ‌వాల గుట్ట‌ల‌ను చూసి ఇట‌లీ అధ్య‌క్షుడు స్వ‌యంగా క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీలే కాదు.. చివ‌ర‌కు ఈ వైర‌స్‌కు చికిత్స చేసే వైద్యులు కూడా చ‌నిపోతున్నారు. ఇప్ప‌టికే చైనాలో ఓ ఈ వైర‌స్ క‌నిపెట్టిన డాక్ట‌ర్ సైతం మృతి చెందారు. ఇక ఈ ప్రమాదకర వైర‌స్ సోకిన బాధితుల‌కు చికిత్స అందించే వైద్యుడు మృతిచెందిన ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.



తమ దేశంలో కోవిడ్‌కు చికిత్స అందించే వైద్యుడు మరణించిన తొలి కేసు ఇదేనని ఫ్రాన్స్‌ ఆరోగ్య మంత్రి ఓలీవర్‌ వీరన్‌ వెల్లడించారు. ఇప్ప‌టికే ఈ వైర‌స్ యూర‌ప్ దేశాల‌కు కూడా విస్త‌రించింది. ఇట‌లీ అల్లాడుతుండ‌గా బ్రెజిల్‌, బెల్జియం, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో సైతం క‌రోనా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఫ్రాన్స్‌లోని ఓయిస్‌ డిపార్ట్‌మెంట్‌లో బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ప్రభుత్వం సరైన మాస్క్‌లు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ బాధితుల‌కు వైద్యం అందించే క్ర‌మంలోనే న‌ర్సులు, వైద్యులు సైతం క‌రోనా భారీన ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఓ డాక్ట‌ర్ ఈ వైర‌స్‌తో మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: