ప్రపంచంలో కరోనా ప్రభావం బాగా చూసిన దేశం ఇటలీ. అక్కడ లక్ష కేసులకు పైగా నమోదు అయ్యాయి. మరో రెండు లక్షలకు పైగా కేసులు రానున్న రోజుల్లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. అక్కడ మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో మరణాలు తక్కువగానే ఉన్నా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇటలీ లో కేసులు తక్కువగా ఉన్నా మరణాలు మాత్రం  రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. అమెరికా వైరస్ ని కట్టడి చేసే విషయంలో చర్యలు తీసుకోవడం లేదు. 

 

ఇటలీ చాలా చర్యలు తీసుకుని లాక్ డౌన్ ని కూడా ప్రకటించింది. అయినా సరే అది మాత్రం కేసులను కట్టడి చేయలేక అవస్థలు పడుతుంది. మొన్నటి తో పోలిస్తే నేడు అక్కడ కేసుల సంఖ్య తక్కువగానే ఉందీ అనేది కొందరి మాట. ఇటలీ లో వాస్తవం మాత్రం చాలా దారుణంగా ఉందని అంటున్నారు. అక్కడ కరోనా సోకిన వారిలో దాదాపు 40 శాతం మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ దేశాలు అంటున్నాయి. దీనికి కారణం అక్కడ వృద్దుల సంఖ్య ఎక్కువగా ఉండటమే అని అంటున్నారు. కరోనా బారిన పడిన వారిలో వృద్దులు ఎక్కువగా ఉన్నారు. 

 

 

వారు అందరూ కూడా ఇప్పుడు చావుకి దగ్గరలో ఉన్నారని ఇటలీ అధికారులే అనే పరిస్థితి ఉంది. అక్కడ వైద్య సిబ్బంది కొరత కూడా చాలా ఎక్కువగా ఉందని వైద్య పరికరాలు అక్కడ అసలు లేవని అంటున్నారు కొందరు. వైద్య పరికరాల విషయంలో ఆ దేశం కరోనా వైరస్ ని తక్కువ అంచనా వేసి ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయలేదు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఇటలీ లో మరణాల సంఖ్య 15 వేలకు దగ్గరగా ఉంది అధికారికంగా. ఇది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని... అందుకే ఆ దేశ పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: