దేశంలో ఇప్పుడు కరోనా రక్కసి కాటేస్తుంది.. మనిషి మనిషి చూసి భయపడి పక్కకు తొలగిపోతున్న సమయం.  ఇలాంటి సమయంలో కరోనాతో మరణించిన వారి వద్దకు బంధువుల సైతం రాలేని దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుంది. తుమ్మినా, దగ్గినా కరోనా అంటూ భయపడి పారిపోయే పరిస్థితి నెలకొంటుంది.  తాజాగా హైదరాబాద్ లో మానవత్వాన్ని చాటిన సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ హిందూ వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఇరుగుపొరుగు నిరాకరించినవేళ,  దాంతో ఐదుగురు ముస్లింలు ముందుకు వచ్చి అంతిమయాత్ర జరిపించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది.  

 

వేణు ముదిరాజ్ ఆటో డ్రైవర్ క్షయ వ్యాధి ముదరడంతో వేణు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 16న మరణించాడు. అతడి భార్య ఎప్పుడో చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇరుగుపొరుగు వారు మాత్రం వేణు కరోనాతో చనిపోయాడని భావించి అతడి మృతదేహాన్ని కాలనీకి తీసుకువచ్చేందుకు అభ్యంతరం చెప్పారు. 

 

ఈ విషయం తెలిసిన సాదిక్ బిన్ సలామ్ అనే ముస్లిం సామాజిక కార్యకర్త తన నలుగురు మిత్రులైన మాజిద్, ముక్తాదిర్, అహ్మద్, ఖాసిమ్ లకు సమాచారం అందించాడు. వెంటనే వారందరూ అక్కడికి చేరుకుని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. హిందూ శ్మశానవాటిక వరకు పాడె మోసి వేణు అంత్యక్రియలు జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: