ప్రాణాంతకర మహమ్మారి కరోనా వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏమి తినాలి మరియు ఏమి తినకూడదు అన్నదాని విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకపక్క ప్రజల కోసం ఎన్నో సూచనలు జాగ్రత్తలు తెలియజేస్తూనే ఉంది. కరోనా వైరస్ అనే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడకుండా మాస్క్ లు ధరించాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ముందునుంచి చెబుతూనే ఉంది. ఇదే సమయంలో కరోనా వైరస్ మందు ఎప్పుడు వస్తుంది, ప్రజెంట్ పరిశోధనలు ఎక్కడి దాకా వచ్చాయి, అన్న దాని గురించి కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రపంచాన్ని అలర్ట్ చేస్తుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ల విషయంలో ప్రపంచ సంస్థలు ఎక్కడిదాకా పరిశోధనలు చేశాయి అన్నదాని గురించి కూడా సమాచారం అందిస్తుంది డబ్ల్యూహెచ్వో.

 

ఇటువంటి టైం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో కేవ‌లం మాంసాహారుల‌కు మాత్ర‌మ క‌రోనా వ‌స్తుంద‌ని, శాకాహారుల‌కు క‌రోనా రావ‌డం లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క శాకాహారికి కూడా కరోనా రాలేద‌ని.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పింద‌నీ.. ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. కేవలం మాంసం తినే వారికి మాత్రమే కరోనా వైరస్ వస్తుందంట వార్తల్లో వాస్తవం లేదని  పూర్తి అబద్ధం అని వచ్చిన ఈ వార్తలు ఫేక్ వార్తలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

 

కరోనా వైరస్ కి పేదవాడు మరియు ధనవంతుడు అనే బేధం ఎలా లేదో అలాగే శాఖాహారం మరియు మాంసాహారం అనే భేదం కూడా లేదని WHO ఇటీవల తెలిపింది . ఈ వైరస్ ఎవరికైనా రావచ్చని ఆహారంతో సంబంధం లేదని కాబట్టి వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా పాటించాల్సిందే తినే ఆహార పదార్థాలను  శుభ్రంగా క‌డిగి.. బాగా ఉడికించి మాత్ర‌మే తినాల‌ని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: