బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి,  నిమ్మగడ్డ రమేష్ , కామినేని శ్రీనివాస రావు భేటీకి సంబంధించి హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లోని సీసీ టీవీ పుటేజ్ దృశ్యాలు బయటకు రావడం, మీడియాలో ప్రచారం అవ్వడం, బిజెపి, తెలుగుదేశం పార్టీ  రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి పరిణామాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సుజనా చౌదరి క్యాంప్ ఆఫీసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా బాటకి వచ్చింది అని తెలియడంతో ఇప్పుడు ఆ వ్యవహారంతో కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి కూడా ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. తన భద్రత కు సంబంధించిన విషయంగా దీనిని పరిగణించి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


 ఇక కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకుని విచారణ చేసే అవకాశం ఉన్నట్టు గా కనిపిస్తోంది. అసలు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లీక్ కావడానికి అవకాశమే లేదు. అలాగే పార్క్ హయత్ హోటల్ యాజమాన్యం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పార్క్ హయత్ హోటల్ యాజమాన్యం కూడా ఆ సీసీటీవీ ఫుటేజీ లీక్ చేయలేదని తెలుస్తుంది. ఏపీ నిఘా వర్గాలు అధికారికంగా లేఖ రాసి వాటిని సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి . అసలు నిజంగానే సుజనాచౌదరి, నిమ్మగడ్డ వంటి వారిపై నిఘా ఏర్పాటు చేశారా ? ఎవరు ఏర్పాటు చేశారు ? 


అసలు పార్క్ హయత్ హోటల్ కు సంబంధించిన ఒక మీడియా ఛానల్ కు అందడం, ఇలా చాలా సంఘటనలు జరిగాయని, అలా ఎలా జరిగిందనే దానిపైనా ఇప్పుడు కేంద్రం ఆరా తీయబోతున్నట్లు తెలుస్తోంది. తన భద్రతకు ముప్పు ఉందని గమనించిన సుజనా చౌదరి ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేశారు. ఇప్పుడు అసలు సీసీ టీవీ పుటేజ్ ఎలా లీక్ అయ్యింది అనే దానిపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడు కావడంతో, రాజ్యసభ చైర్మన్ ద్వారా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ నిఘా వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: