తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి వెబ్సైట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రజలందరికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతో సులభతరం కానుంది.  అయితే ఇన్ని రోజుల వరకు ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి ధరణి వెబ్ సైట్ ను తెరపైకి తీసుకొచ్చి సంచలనమే సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ఎంతో మందికి రిజిస్ట్రేషన్ కష్టాలు ధరణి వెబ్సైట్ తో తీరుతాయి అని చెప్పాలి. సాధారణంగా రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ దానికి సంబంధించిన పాసుబుక్కులు రావడానికి మాత్రం ఎంతో సమయం పట్టేది.



 ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినప్పటికీ పని అయ్యేది కాదు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎంతో కాలం పాటు కాలయాపన చేస్తూ వచ్చే వారు. కానీ ప్రస్తుతం ధరణి పోర్టల్  ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎంతో సులభతరం కానుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన ధరణి పోర్టల్ దసరా నుంచి తెలంగాణలో అమలులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజుల వరకు ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు పాస్ బుక్ కావాలి అంటే దాదాపుగా నెలల సమయం పట్టేది.



 ఎన్ని రోజులు గడిచినా ఎప్పుడు పాస్బుక్ వస్తుంది అన్నది మాత్రం క్లారిటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా ఎంతో సులభంగా కేవలం గంటల వ్యవధిలోనే పాస్బుక్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక ధరణి పోర్టల్ ప్రారంభం తర్వాత సాగు భూముల రిజిస్ట్రేషన్ తహసిల్దార్ కార్యాలయంలో జరుగనున్నాయి... స్లాట్ బుక్ చేసుకుని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. స్లాట్  బుక్ చేసుకున్న సమయంలో వెళితే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ రికార్డుల అప్డేషన్ అన్ని  అక్కడే పూర్తి అయ్యి  కేవలం అరగంటలో పాసుబుక్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: