మనదేశంలో ఎక్కువగా వాయు కాలుష్యానికి గురైన నగరం ఢిల్లీ.. రాజధాని లో విపరీతమైన వాహనాల వల్ల వచ్చే కాలుష్య ఒకవైపు, మరియు రాజధాని చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రాంత రైతులు తమ పంట పొలాల లో మిగిలిన వ్యర్థాలను తగల పెట్టడం విపరీతమైన స్మోక్ రావడంతో వచ్చే కాలుష్యం ఈ కాలుష్యం వల్ల శీతాకాలం సమయంలో రాజధాని ఢిల్లీలో పొగమంచు విపరీతంగా పడటంతో ఆ మధ్యన కార్యాలయాలకు, పాఠశాలలకు ఒక నెల పాటు సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. అయితే నగరాన్ని ఒకవైపు కాలుష్యం మరోవైపు పొగమంచు చుట్టు కమ్మేస్తుంది. దీంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


 ఇక కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 'Yuddh. Pradushan ke Viruddh' అనే కార్యక్రమం చేపట్టి కాలుష్యానికి వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుమ్ము వ్యతిరేక ప్రచారం, బయో డికంపోసర్ విధానం, ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ విధానం, ఎలక్ట్రికల్ వాహనాల పాలసీని తీసుకువచ్చారు. ప్రతీ ఏటా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రైతులు అనేక ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చుతారు. ఈ చర్య అక్కడ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.



డీ కంపోసింగ్ విధానం ప్రవేశపెట్టింది. దుమ్మును తగ్గించడానికి యాంటీ స్మోక్ గన్స్  ను సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దుమ్మును తగ్గించడానికి ఈ గన్ లు నీటి బింధువులను స్ప్రే చేయనున్నాయి. ఢిల్లీ వాయు కాలుష్యం లో ఎక్కువ భాగం ధర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే కాలుష్యం అందుకుగాను ఇటీవల నగర్ సమీపంలో ఉన్న 11 ధర్మల్ పవర్ ప్లాంట్ ను మూసివేశారు. అలాగే పచ్చదనం ని పెంచే విధంగా ఏదైనా నిర్మాణ సమయంలో తొలగించిన మొక్కల్లో 80 శాతం తిరిగి నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: