చైనా క్రియేట్ చేస్తున్న సైలెంట్ మాఫియా ఇంతా ఇంతా కాదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే కరోనా వైరస్. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇంకా పట్టి పీడిస్తోంది. వాళ్ళు చేసిన పాపాలకు ప్రపంచం మొత్తం అనుభవిస్తోంది. ఇంకా అది మర్చిపోకుండానే ఇపుడు మరో వార్త తెరపైకి వచ్చింది. దానిపేరు ఎల్లో డస్ట్. అవును.. చైనా నుండి ఎగసి వస్తున్నఎల్లో డస్ట్‌తో ఉత్తర కొరియా వణికిపోతున్నది.

ఈ విషయమై దేశ వ్యాప్తంగా అలెర్ట్‌ చేయడంతో పాటు, నిర్మాణ పనులపై అక్కడి ప్రభుత్వం ఎక్కడికక్కడ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో వారు ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని, కిటికీలు పూర్తిగా క్లోజ్ చేసుకోవాలని అధికారిక మీడియా, కొరియన్‌ సెంట్రల్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం మాస్కులు తప్పనిసరి అని సూచించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే... చైనా నుంచి ఎగసి పడే ఎల్లో డస్ట్ వల్ల కరోనా వైరస్‌.. కిమ్‌ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతోనే ఉత్తర కొరియా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అక్కడి అధికారిక దినపత్రిక రొడొంగ్‌ సిన్‌మన్‌ ఎల్లో డస్ట్‌ విషయమై ప్రజలను అప్రమత్తం చేసింది. దీని ద్వారా మహమ్మారి వైరస్‌ దేశంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాన్ని ముందుగానే పసి గట్టాలని జనులకు విజ్ఞప్తి చేసింది.

కాగా.. ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా సీడీసీ పరిశోధనలు వెల్లడిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇలాంటి కరోనా గడ్డు సమయంలో ఎల్లోడస్ట్‌ను కూడా తీవ్రంగా పరిగణించాలి అని వారి అభిప్రాయం. అందుచేత ఎల్లోడస్ట్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడంలో భాగంగా ప్రవేశించకుండా నిరోధించడమే అత్యంత కీలకం అని రొడొంగ్‌ సిన్‌మన్‌ అధికారికంగా పాటించడం గమనార్హం. ఇక ఈ విషయమై కిమ్ చైనా పైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: