మామూలు దసరా పండగ వచ్చిందంటే చాలు భారత్ లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రజలు దుర్గామాత పూజించేందుకు ఆలయాలకి వెళుతూ ఉంటారు. కొంతమంది చిత్రవిచిత్రంగా దేవుళ్ళకూ మొక్కులు చెల్లించుకుంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటివి చూసినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మామూలుగా మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తాం. దేవతకు మొక్కులు చెల్లించుకోవడం ఏకంగా  భారీ శూలాన్ని  నాలుక పై గుచ్చుకుని  అటు నుంచి ఇటు లాక్కోవడం... ముఖంలో విచిత్రంగా శూలం  గుచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి నిజజీవితంలో కూడా అక్కడక్కడా జరుగుతూ ఉంటాయి.




 కానీ చాలామంది ఇలాంటివి చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆధునిక పోకడల్లో  జనం ఆలోచించే తీరు మారింది కాబట్టి ఇలాంటివి దాదాపుగా ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. కానీ రోజు రోజుకి దేవుళ్లకు జరిగే పూజలు మాత్రం మరింత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా ఇక్కడ ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఒక యువకుడు భక్తి పారవశ్యంలో ఏకంగా తనను తాను మరచి పోయాడు. తాను ఏం చేస్తున్నాడో అన్న విషయాన్ని కూడా గ్రహించలేకుండా ఆలోచన కోల్పోయాడు యువకుడు.



 చివరికి భక్తి పారవశ్యంలో తనకు తెలియకుండానే ఏకంగా తన నాలుక కత్తిరించు కుని దుర్గామాతకు సమర్పించాడు.  ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. ఉత్తరప్రదేశ్లోని బాడీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. 22 ఏళ్ల ఆత్మారాం అనే యువకుడు తొమ్మిది రోజులపాటు దుర్గా మాతకు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేశాడు. తొమ్మిదో రోజున ఆలయానికి చేరుకుని దుర్గా మాతకు ప్రత్యేక పూజలు జరపాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా భక్తిపారవశ్యంలో తన నాలుకను మొక్కుగా దుర్గామాతకు చెల్లించు కొన్నాడు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: