ప్రపంచాన్ని మొత్తాన్ని తన చెరలో బందించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం అంటే అది కరోనా వైరస్.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాల్లో పాకింది. ముఖ్యంగా చెప్పాలంటే కంటికి కనిపించకుండా కేవలం , తుమ్ము, లేదా గాలి ద్వారా మనుషులకు వ్యాపిస్తున్న ఈ కరోనా ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఒక్కటై తగు జాగ్రత్తలతో పాటుగా , నియంత్రణ చర్యలను చేపట్టాయి. అయితే భారత్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి కరోనా నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది.



దాదాపు దేశ విదేశాలలో కట్టిడిని ముమ్మరం చేశారు.. అయిన కరోనా ప్రభావం పెరుగుతూ వచ్చింది.. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఎన్నో లక్షల మంది కరోనా భారీన పడగా , కొన్ని వేల మంది కరోనా వల్ల మృత్యువు ఒడిలోకి చేరారు. ఇప్పుడు చూస్తే కరోనా కేసులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి.. దీంతో ఆ దేశాలకు పూర్వ వైభవం వచ్చింది.వ్యాపార, వాణిజ్యాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో..గత ఐదు నెలలుగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రజలు ఇప్పుడు కాస్త తేరుకున్నారు.




ఇకపోతే పోయిందిలే అనుకున్న కరోనా ఇప్పుడు మరోసారి విజృంభిస్తోంది.. రెండో సారి ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. దాంతో అప్రమత్తమైన దేశాలు కట్టడి చర్యలను మొదలు పెట్టారు. రెండో విడత భయంకరంగా ఉంటుందని చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలతో పాటి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. ఇకపోతే స్పెయిన్ వంటి దేశాల్లో ఈ కరోనా ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే స్పెయిన్ లో రాత్రి పూట కర్ఫ్యూ ను విధించారు. ప్రజలను రాత్రి పూట తిరగొద్దని సూచించారు. మన దేశంలో కూడా రెండో వే రాకముందే జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. స్వయం శుభ్రత పాటించాలని చెబుతున్నారు.. ప్రభుత్వాలు కరోనా గురించి ఆలోచించే సమయం లేదు.. మనల్ని మనమే కాపాడుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: