రోజువారీ జీవన విధానంలో ఖచ్చితంగా తినడానికి ఉపయోగించే పదార్థాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇంట్లో దొరికే కొబ్బరినూనె, కలబంద, మిరియాలు, అల్లం, కొత్తమీర వంటి దినుసులు, కూరగాయల్లో సహజ సిద్ధమైన లక్షణాలు దాగి ఉన్నాయి. వీటికి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు. ఎన్నో శతాబ్దాలుగా పలు రకాల వైద్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం రండీ.

కొబ్బరినూనె: శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ (హై-డెన్సిటీ లిపో ప్రొటీన్/హెచ్ డీఎల్) కొబ్బరినూనెలో సహజసిద్ధంగానే దొరుకుతుంది. హెచ్ డీఎల్ ను పెంచడం ద్వారా కొబ్బరినూనెలోని శాచురేటెడ్ కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు పెదాలు పగిలినప్పుడు చికిత్సకు కూడా కొబ్బరినూనెను వాడుతుంటారు.

కలబంద: చర్మ సంబంధిత వ్యాధులను పరిష్కరించడంలో కలబంద ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధితో బాధ పడుతున్న రోగులకు ఇదో చక్కని ఔషధమనే చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. కాలికి దెబ్బ తగిలినప్పుడు అలోవెరాను రాసుకుంటే గాయం నయం అవుతుంది.


ధనియాలు: రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ధనియాలు ఎంతో మేలు చేస్తుంది. ధనియాలు యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ క్యాన్సర్, న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధుల నివారిణిగా పని చేస్తుంది. రోగనిరోధన శక్తిని పెంచడంతో పాటు, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.

జీలకర్ర: జీలకర్ర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

అల్లం/నల్ల మిరియాలు: అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫ్లూ, జలుబు నివారణకు ఉపయోగపడుతుంది. నల్ల మిరియాలు సుగంధ ద్రవ్యాల్లో రాజుగా పిలుస్తారు. ఇందులో విటమిన్-బి అధికంగా ఉంటుంది. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి ఎంతో దోహదపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: