ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ మాక్రాన్ ‌పై ముస్లింలు మండిపడుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఫ్రాన్స్‌ ఉత్పత్తులనే బ్యాన్ చేశాయి. తమ రాయబారులను సైతం వెనక్కి రప్పిస్తున్నాయి. ఇంతకీ మెక్రాన్‌పై ముస్లింలు ఎందుకు కోపంగా ఉన్నారు..? అసలు వివాదానికి  కారణమేంటనే కదా..

ఫ్రాన్స్‌ అధ్యక్షుడి వ్యతిరేక ఆందోళనలు ప్రపంచ దేశాలకు పాకుతున్నాయి. మాక్రాన్ ‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన దిష్టిబొమ్మలు కాలిపోతున్నాయి. కొన్ని దేశాలు దౌత్య సంబంధాలనే తెంచుకునేందుకు సిద్ధపడ్డాయి. ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ, టర్కీ, పాక్‌ దేశాలు ఓ రేంజ్‌లో ఫైరవుతున్నాయి. భారత్‌ లో కూడా ఆందోళనలు జరిగాయి. ముంబయిలో మెక్రాన్‌ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ వివాదానికి అక్టోబర్‌ 16న బీజం పడింది. ఫ్రాన్స్‌లో శామ్యూల్‌  పాటీ అనే టీచర్‌ను స్కూల్‌ సమీపంలోనే గొంతుకోసి చంపాడు నిందితుడు. మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను విద్యార్థులకు చూపిస్తున్నాడన్న కోపంతో కిరాతకంగా  హత్యచేశాడు. అరెస్ట్ తర్వాత స్వయంగా నిందితుడే ఈ విషయాన్ని చెప్పాడు.

ఉపాధ్యాయుడి హత్యపై స్పందించిన మాక్రాన్‌...ఇది ఇస్లామిక్ టెర్రరిజం అంటూ  ఫైరయ్యారు. ప్రవక్త కార్టూన్‌లను చూపించిన టీచర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర సత్కారం ఇచ్చారు. మాక్రాన్‌ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీచర్‌ హత్యను ఇస్లామిక్‌ టెర్రరిజంగా అభివర్ణించారు.

అంతేకాదు.. ఫ్రాన్స్‌లో ముస్లిం సంస్థలపై చర్యలు కూడా తీసుకున్నారు. మసీదులపై దాడులు కూడా జరిగాయి. అసలే మాక్రన్ ప్రకటనతో కోపంగా ఉన్న ఇస్లామిక్ దేశాలు.. ఇలాంటి ఘటనలతో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. మాక్రాన్‌ ముస్లింల  వ్యతిరేకి అంటూ..ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి.

మొత్తానికి మాక్రాన్ పేరు ఎత్తితే చాలు ముస్లిం సమాజం మండిపడుతోంది. ఆ టీజర్ మహ్మద్ ప్రవక్తను చూపిస్తే తప్పేంటనే వాదిస్తున్నారు వాళ్లు. పైగా మాక్రాన్ దీన్ని ఖండించడం పక్కన పెట్టి ముస్లిం సమాజాన్ని టెర్రరిజంతో పోల్చడం ఏంటంటూ ఫైర్ అవుతున్నాయి ముస్లిం సంఘాలు.  అందుకే ఫ్రాన్స్ తో దౌత్య బంధాలు తెంచుకోవడంతో పాటు.. ఆ దేశ ఉత్పత్తులకు స్వస్తి పలికాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: