చార్మినార్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. అభ్యర్థులు తమ పార్టీ అంటే తమ పార్టీ గొప్పదని, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రచారాలు చేస్తూ రంగంలోకి దిగారు.  కూరగాయలు అమ్ముతూ కొందరు.. దోశలు వేస్తూ మరికొందరూ.. ర్యాలీలు నిర్వహిస్తూ ఇంకొందరూ.. ఇలా గల్లీగల్లీ తిరుగుతూ ఓట్లు వేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఘాన్సీబజార్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అనూష గౌడ్..
చార్మినార్ లోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని ఘాన్సీబజార్ టీఆర్ఎస్ అభ్యర్థి అనుష గౌడ్ అన్నారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మహ్మద్ సలావుద్దీన్ లోధితో కలిసి డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ అస్లాం ఉల్లా షరీఫ్..

ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ అస్లాంను ఓటు వేసి గెలిపించాలని టీపీసీసీ మైనార్టీ డిపార్ట్ మెంట్ చైర్మన్ అబ్దుల్లా సొహేల్ అన్నారు. పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ అస్లాంతో కలిసి డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ అస్లాం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానన్నారు.

పురానాపూల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పెండ్యాల లక్ష్మణ్...

టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే విజయానికి దోహదపడతాయని పురానాపూల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పెండ్యాల లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మొఘల్ పురా డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సరితా యాదవ్...

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ఎంతో పాటుపడుతోందని మొఘల్ పురా డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సరితా యాదవ్ తెలిపారు. డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: