వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ పార్టీ పెద్ద బ్రేక్ వేసింది.. అవలీలగా గెలిచేస్తామని అనుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ మట్టి కరిపించి తమ బలం ఏంటో చూపించారు బీజేపీ పార్టీ నేతలు.. దుబ్బాక లో ఉన్న పరిస్థితులు వేరు అక్కడ టీ ఆర్ ఎస్ వైఫల్యం అనేకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి పై సింపతీ తోనే వారు గెలిచారు అని చెప్పొచ్చు..వరుసగా రెండు సార్లు ఓడిపోయినా రఘునందన్ రెడ్డి మూడో సారి కూడా పోటీ చేయడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యి పార్టీ ని గెలిపించేలా చేశాడని చెప్పొచ్చు..

అదే ఆ ఉత్సాహంలో ఉన్న బీజేపీ  గ్రేటర్ ఎన్నికల్లో  ఎలాంటి సింపతీ లేకుండా ఇక్కడ పార్టీ గెలిచేలా కనిపిస్తుంది..ఇది టీ ఆర్ ఎస్ పై ఉన్న వ్యతిరేకత అని స్పష్టంగా తెలుస్తుంది. అనుకున్న దానికంటే సమయం తక్కువ గా ఉండడంతో బీజేపీ హడావుడిగానే ఎన్నికల పనులు ప్రారంభం చేసింది. దానివల్ల పార్టీ లో కుమ్ములాటలు కూడా జరిగాయి.. దాంతో బీజేపీ పార్టీ గెలవదేమో అనుకున్నారు. కానీ ప్రచారం అంకం ముగిసే సమయానికి చూస్తే బీజేపీ కె బలం ఎక్కువ ఉందని తెలుస్తుంది..

అయితే ఇంత సడెన్ గా బీజేపీ పార్టీ జోరుగా ఉండడానికి కారణం ఏంటని చూస్తే బీజేపీకి మొట్ట మొద‌టి ఊపు దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెలుపుతో ప్రారంభ‌మైంది. ఆ గెలుపు ఆ పార్టీ శ్రేణుల‌కు తెలంగాణ‌లోనే కాదు, ఏపీలో కూడా కొత్త ఉత్సా‌హాన్ని ఇచ్చింది. ఇంత‌లో గ్రేట‌ర్ ను ఎన్న‌డూ లేని స్థాయిలో వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఒక్క‌సారిగా వ‌చ్చిన ఉప‌ద్ర‌వంతో న‌గ‌రాన్ని కుదుటుప‌డేలా చేయ‌డం ప్ర‌భుత్వానికి శ‌క్తికి మించిన భారంగా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. ముంపు బాధితుల‌కు త‌క్ష‌ణ స‌హాయంగా రూ. 10 వేలు ప్ర‌క‌టించింది. స‌రైన‌ ప్ర‌ణాళిక‌లు లేకుండానే ఇంటింటికీ వెళ్లి పంపిణీకి శ్రీ‌కారం చుట్టింది. అది కొన్నిచోట్ల బెడిసి కొట్టింది. స‌హాయం అంద‌లేదంటూ వంద‌లాది మంది రోడ్డెక్కారు. ఇదే అదునుగా భావించి ప్ర‌భుత్వంపై ఉన్నఅసంతృప్తిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి బీజేపీ రంగంలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: