గ్రేటర్‌ ఎన్నికల్లో మలక్‌ పేట సర్కిల్‌ పరిధిలోని డివిజన్లలోని వివిధ పార్టీలకు చెందిన  ముఖ్య నేతలు, పార్టీల అభ్యర్ధులు మంగళవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా చోట్ల అధికార పార్టీ రిగ్గింగ్ కు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ అదేమీ లేదని ఆరు లోపు వచ్చి లైన్ లో ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వడంతో ఓటింగ్ శాతం అంత పెరిగిందని చెబుతున్నారు. త‌గ్గిన ఓటు శాతం వారికే ఎఫెక్ట్ ప‌డుతుందంటే... వారికే ప‌డుతుందంటూ విప‌క్షాలు.. కామెంట్ చేస్తూ... మా గెలుపు త‌థ్యం అంటూ చెప్పుకుంటున్నాయి.

అయితే వాస్త‌వానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలో ముప్పై అయిదు శాతం పైన మాత్రమే పోలింగ్‌ జరగడం అందరినీ ఆలోచనలో ప‌డేస్తోంది. ఎన్నికల అధికారులు. ఉదయమే కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనుంది.

ఇక గ్రేటర్ పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఈనెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులను తెలంగాణ ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ నుంచి 31 మందిని పర్యవేక్షకులుగా నియమిస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపును ఆయా వార్డులు, సర్కిల్‌ కార్యాలయాల్లో పర్యవేక్షించే అధికారులు పరిశీలిస్తారు.

అయితే ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే వీరంతా ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులుగా ఓటింగ్‌ జరిగే ప్రదేశాల్లో పనిచేస్తారు. లెక్కింపు ప్రక్రియలో క్రమశిక్షణ పాటించడం, గొడవలు కాకుండా నియంత్రించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులుగా నియమితులైన వారితో ఎన్నికల కమిషనర్‌ గురువారం ఉదయం 11గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈసమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు వారి విధులను, బాధ్యతలకు సంబంధించి అంశాలను వివరించనున్నారు.==

మరింత సమాచారం తెలుసుకోండి: