కరోనా మహమ్మారి కారణంగా ఒక్క సంవత్సర కాలం వెనక్కు వెళ్ళాము. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రమాదకర పరిస్థితుల నుండి కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎట్టకేలకు కరోనాకు వ్యాక్సిన్ వచ్చి, వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది...ఇంతలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడం నిజంగానే మనసును తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే అసలేమి జరిగిందో వివరాల్లోకి వెళితే వేములవాడకు చెందిన నారాయణగా ఇతనిని గుర్తించారు... కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను స్వతహాగా వ్యాపారస్తుడు కాగా, ఈయనకు ఇద్దరు కొడుకులున్నారు.

కొద్ది రోజుల క్రితమే కరోనా వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా కరోనా పేషేంట్లు ఇతని ఆత్మహత్య గురించి తెలియడంతో కంగారుపడుతున్నారు. నారాయణ పక్కన ఉన్న వారు చెబుతున్న ప్రకారం అతనికి కరోనా ఉందని తెలియడంతో తీవ్ర బాధకు లోనయ్యాడని, బహుశా ఇదే ఆయన ఆత్మహత్యకు కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

ఆసుపత్రి వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం, ఈయన జనవరి 13 వ తేదీన కరోనా వ్యాధితో జాయిన్ అయ్యారు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడ పనిచేస్తున్న నర్సు మెడికేషన్‌కు సిద్దం చేస్తోంది. అయితే ఆ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న కోవిడ్ 19 వార్డు నుంచి దూకి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స చేస్తుండగా, మధ్యలోనే నారాయణ చనిపోయినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన నారాయణ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చారు... ఆసుపత్రి సిబ్బంది అన్ని పార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. కరోనా వచ్చినంత మాత్రాన ప్రాణాలకు ప్రమాదం లేదని ప్రభుత్వం చెబుతున్నా, డాక్టర్స్ చెబుతున్నా వినకుండా ఇలా భయంతో చనిపోవడం చాలా బాధాకరమని కొందరు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: