అక్రమ సంబంధాలు ఇప్పుడు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. కట్టుకున్న వాళ్ళు వుండగానే మరొకరితో సహజీవనం చేస్తున్నారు. వాటి వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. లేదా అనుమానాలు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకోకుండా మరొకరి తో సంబంధం పెట్టుకున్న మహిళకు భర్త షాక్ ఇచ్చాడు. ఆషా దేవీ, సూరజ్ కుమార్ అనే జంట అలహాబాద్ హైకోర్టు లో ఓ పటిషన్ ను దాఖలు చేసుకుంది. తాము ఇద్దరము కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామనీ, తమ పై ఎవరూ ఎటువంటి కేసులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మా బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూడాలని వేడుకుంది.



వీరి ఆవేదనను విన్న అలహాబాద్ హైకోర్టు, వీరి బంధం గురించి ఈ కేసు విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది.
అయితే ,వీరి పిటిషన్ ను అడ్డంగా కొట్టేసింది.'పిటిషన్ ను దాఖలు చేసిన జంట లో, ఆశాదేవికి గతంలోనే పెళ్లయింది. ఆమెకు భర్త ఉన్నాడు. అతడికి విడాకులు ఇవ్వకుండానే మరొక వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. చట్టబద్దంగా భర్తకు విడాకులు ఇవ్వకుండానే సూరజ్ తో కలిసి ఉంటోంది. ఇది చట్టపరంగా న్యాయం ఎలా అవుతుంది. ఇలాంటి విషయాల్లో పిటిషనర్ రక్షణ కోరడానికి అర్హులు కాదు.



ఈ పిటిషన్ పై విచారణను జరిపిన కోర్టు కొట్టి వేసింది.. కాగా ఆశా దేవి చంద్రకు భార్యేనని వెల్లడించారు. పెళ్లయి ఒక బంధంలో ఉండగా, జీవిత భాగస్వామిని కాకుండా మరో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా నేరమేననీ, పలు సెక్షన్స్ కింద కేసు లు నమోదు చేశారు. ఇప్పటికయినా ఆశాదేవి తన తప్పేంటో గ్రహించి భర్త వద్దకు వెళ్లడమో, లేక చట్టపరంగా అతడితో విడాకులు తీసుకోవడమో చేయాలని సూచించారు..కోర్టులో వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. చట్ట పరంగా తన భర్త దగ్గరకు వెళ్ళాలని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: