ఓ వ్యక్తి డబ్బుల కోసం అన్నంత పని చేసేవాడు. డబ్బుల కోసం అడ్డమైన గడ్డిని కూడా తినేవాడు.. భార్య భర్తలు ఆ శృంగారం లో ఉన్న వీడియోలను, ఫోటోను సేకరించి వాటిని అడ్డుపెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసేవాడు.కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అతను వేరే జాబ్చేస్తూ కూడా ఇలాంటి పనులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలో జరిగింది.



టెలిస్ ఫోరో అవిలీస్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఏడీటీ అనే హోమ్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తుండేవాడు. డల్లాస్, టెక్సాస్ రాష్ట్రాల్లోని ఆ కంపెనీ కస్టమర్లకు సేవలు అందించడం అతడి విథి. ఆ కస్టమర్ల ఇళ్లల్లో సెక్యూరిటీ కెమెరాలను ఫిక్స్ చేయడం, వాటి పనితీరులో లోపాలు ఉన్నాయని కస్టమర్లు ఫిర్యాదు చేస్తే వాటిని పరిస్కరించడం అతడి పని. అమెరికా వంటి రాష్ట్రాల్లో ప్రతి ఇళ్లల్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ తరహా కంపెనీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆ సీసీ కెమెరాల ఫుటేజీని, వాటి ఆపరేటింగ్ ను అంతా ఆ ఇళ్ల యజమానులే చూసుకుంటారు.



రెండు రాష్ట్రాల్లోని కంపెనీ కస్టమర్లలో అందమైన మహిళలు ఏ ఇళ్లల్లో ఉన్నారన్నది పరిశీలించాడు. దాదాపు 200 ఇళ్లను టార్గెట్ చేసుకున్నాడు. ఆ ఇళ్లకు వెళ్లి కంపెనీ తరపున వచ్చామని చెప్పి, సీసీటీవీలను పరీక్షించాలనేవాడు. ఆ సమయంలోనే తెలివిగా తన ఈమెయిల్ ను కూడా ఆ సీసీటీవీ ఫుటేజీలను యాక్సెస్ చేసుకునేందుకు ఇచ్చేవాడు. దాన్ని కస్టమర్లు గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అలా మొత్తం 9600 శృంగార వీడియోలను సేకరించాడు. వాటిని చూపించి ఆ కస్టమర్లకు వేరే నెంబర్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేయడమో, లేక ఆ వీడియోలను నీలిచిత్రాల వెబ్ సైట్లలో పెట్టడమో చేసేవాడు. ఇతగాడి బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు అసలు కథంతా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: