ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించదని తెలిసి కూడా ఎన్నికలు పెట్టేందుకే నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు దశల ఎన్నికలకు నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకటించారు. అదే సమయంలో తనకు సహకరించని అధికారుల తీరుపై విమర్శలు చేశారు. ప్రభుత్వం సహాయ నిరాకరణ గురించి విమర్శలు చేశారు. అంతే కాదు.. రాజ్యాంగం గురించి దాని ప్రాముఖ్యత గురించి లెక్చర్ దంచారు.

అంత వరకూ బాగానే ఉంది. అదే సమయంలో తాను ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను సీఎస్‌, ఇతర అధికారులు మీడియాకు ఇస్తున్నారని.. ఇది చట్టరీత్యా సరికాదని అన్నారు. ఇవన్నీ గోప్యంగా ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు గోప్యం గురించి మాట్లాడుతున్న నిమ్మగడ్డ.. మరి తాను కేంద్రానికి రాసిన లేఖను ఎందుకు ఎల్లో మీడియాకు లీక్ చేశారని ప్రశ్నిస్తున్నారు.

18. 3. 2008నలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్..  హోం సెక్రటరీ కి రాసిన లెటర్ ..  టిడిపి కార్యాలయం నుండి వచ్చిందని... ఈ లేఖ ఎందుకు లీక్ అయిందని ప్రశ్నిస్తున్నారు. దుర్మార్గమైన ఆలోచనలతో ఎన్నికల కమిషన్ పోతుందంటున్న వైసీపీ నాయకులు ముందు నిమ్మగడ్డ తన తప్పులు ఒప్పుకుని ఇతరులపై విమర్శలు చేయాలని సూచించారు. ఇప్పుడు ఎన్నికల కోసం ఇంతగా పోరాడుతున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు.

నిమ్మగడ్డ అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని..  మాకు ప్రజలు ఉద్యోగ ప్రాణాలు ముఖ్యమని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు.. ఎన్నికల కమిషనర్ హైదరాబాద్ లో ఉంటారు... ఎన్నికల్లో ఏకగ్రీవంగా కాకూడదా... గ్రామాల్లో అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వం ఏక‌గ్రీవ పంచాయ‌తీకి రూ.10 ల‌క్షల నుంచి రూ.20 ల‌క్షల దాకా ప్రోత్సాహ‌కాలు అంద‌జేస్తోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: