ఆంధ్రప్రదేశ్ లో గడిచిన పంచాయతీ ఎన్నికలు టీడీపీకి ఒక మరిచిపోని పీడకల అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ కంచుకోటల్లోనే వైసీపీ తన విజయభేరిని మోగించడం ఇప్పటికీ టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. దీనితో టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి జంపింగ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది టీడీపీ పని ఇక పోయిందని మారుతుంటే, జగన్ ముందు చంద్రబాబు నిలబడలేదు అని మరి కొంతమంది పార్టీ మారుతున్న పరిస్థితి. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పం నియోజకవర్గంలో ఓడిపోయిన దాఖలాలు లేవు. కానీ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో 89 గ్రామ పంచాయతీలకు కేవలం 14 గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం చూస్తుంటే ఎందుకు ఇలా జరిగిందో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలకు అర్ధం కాని పరిస్థితి.

అదే విధంగా రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాంతాలలో అక్కడి నాయకులను చిత్తు చేసి వైసీపీ జెండా పాతింది. ఇందులో మరొక ముఖ్యమైన నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని హిందుపూర్. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వచిస్తున్నప్పటినుండి ఇప్పటి వరకు ఆ ప్రాంతం టీడీపీ కంచుకోట. ఎన్ని పార్టీలు వచ్చినా అక్కడ టీడీపీ జెండాని కదల్చలేకపోయాయి. అలాంటి చోటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడం అటు టీడీపీ నాయకులకు మరియు టీడీపీ అధిష్ఠానానికి తీరని బాధని మిగిల్చింది.

అయితే ప్రస్తుతం హిందూపూర్ లో స్థానిక ఎన్నికల ఓటమిని తట్టుకోలేని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధికార పార్టీ వైసీపీపై తొడగొట్టాడు. ఈరోజు మనము ఓటమి చెందామని కృంగిపోకండి. అంతే ధైర్యంతో ఇప్పుడు జరగబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మన సత్తా చూపించండి అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ దౌర్జన్యాలను మార్చే దిశగా మార్పు తెచ్చుకోవాలని తన అభిమానులకు మరియు టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. మీకు అండగా నేనుంటానని భయపడాల్సిన అవసరం లేదని పార్టీ కార్యకర్తలను చైతన్యపరిచారు. బెదిరింపులకు లోంగే పార్టీ టీడీపీ కాదని, దమ్మున్న పార్టీ అని...ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ ఎదిరించి నిలబడ్డ తీరును అందరూ గుర్తు తెచ్చుకోవాలన్నారు. మరి బాలకృష్ణ తొడ దెబ్బ వైసీపీ శ్రేణులకు తగులుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: